ఈ సంక్రాంతికి రామ్‌ చరణ్ గేమ్‌ ఛేంజర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమాకు మొదటి రెండు రోజులు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి.సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా యూనిట్‌ సభ్యుల ప్రమోషన్‌తో బజ్‌ క్రియేట్‌ అయ్యింది. దాంతో సినిమాకు సాలిడ్‌ వసూళ్లు నమోదు అయ్యాయి అని, అవుతూనే ఉన్నాయి అని దిల్‌ రాజు అండ్‌ టీం సోషల్‌ మీడియా ద్వారా చెబుతూ వస్తున్నారు. సినిమాలో రామ్‌ చరణ్ నటనకి కచ్చితంగా అవార్డ్‌ రావాల్సిందే అంటూ అభిమానులు తెగ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదే సమయంలో సినిమాలోని ఇతర నటీనటుల గురించి సోషల్‌ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.ఈ సమయంలో రామ్‌ చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా గేమ్‌ ఛేంజర్‌ యూనిట్‌ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రెస్‌ నోట్‌ను విడుదల చేశారు. గేమ్‌ ఛేంజర్ సినిమా కోసం మేము పడ్డ కష్టంకు ప్రతిఫలం దక్కింది. మీ నుంచి వస్తున్న స్పందనకు సంతోషంగా ఉంది. ఈ విజయాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులు అందరికీ హృదయపూర్వక అభినందనలు అన్నారు. మీరు చూపించిన అచంచలమైన ప్రేమ అభిమానం నాకు గొప్ప బహుమానం. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ముందు ఉండి నడిపిన మీడియా వారికి కృతజ్ఞతలు అన్నారు.

ఈ ఏడాది ఇలాంటి ఒక ఆరంభం దక్కించుకున్నందుకు సంతోషంగా ఉంది. గేమ్‌ ఛేంజర్ సినిమా ఎప్పటికీ నా హృదయంలో స్పెషల్‌ స్థానంను కలిగి ఉంటుంది. ఇలాంటి ఒక మంచి సినిమాను నాకు ఇచ్చినందుకు దర్శకుడు శంకర్‌ సార్‌కి ధన్యవాదాలు అంటూ రామ్‌ చరణ్ తన నోట్‌లో పేర్కొన్నారు. ఒక వైపు సినిమాపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి, దర్శకుడు శంకర్‌ను తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో దర్శకుడు శంకర్‌కి ధన్యవాదాలు చెప్పడం ద్వారా రామ్‌ చరణ్ ఎంతో ఉన్నత స్థితికి ఎదిగారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.గేమ్‌ ఛేంజర్ నుంచి వెంటనే బయటకు వచ్చిన రామ్‌ చరణ్‌ త్వరలోనే బుచ్చిబాబు సినిమా షూటింగ్‌కి జాయిన్‌ కాబోతున్నారు. ఇప్పటికే బుచ్చిబాబు స్పోర్ట్స్‌ డ్రామా మూవీ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. అందుకు సంబంధించిన లుక్‌లోనే గత కొన్ని రోజులుగా రామ్‌ చరణ్ మీడియాలో కనిపిస్తున్నారు. ఈ ఏడాదిలోనే రామ్‌ చరణ్‌తో బుచ్చిబాబు రూపొందిస్తున్న సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమ్మర్‌లో సినిమా టైటిల్‌ను రివీల్‌ చేయడంతో పాటు ఫస్ట్‌లుక్‌ను రివీల్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారని సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: