అనుకున్న అంచనాలను అందుకోలేదు గ్లోబల్ స్టార్ నటించిన గేమ్ చేంజర్ సినిమా. బాక్సాఫీస్ ముందు పెద్దగా కలెక్షన్లు కూడా రాబట్టడం లేదు. ఇప్పటివరకు 300 కోట్లు ఈ సినిమా వసూలు చేసినట్లు చెబుతున్నారు. అది కూడా ఫేక్ అని కొంతమంది ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో రామ్ చరణ్ హీరోగా చేసిన ఈ సినిమా దర్శకుడు.... శంకర్ స్పందించారు. ఈ సినిమా రిజల్ట్ పైన సంచలనం వ్యాఖ్యలు చేశారు దర్శకుడు శంకర్.
రామ్ చరణ్ చేసిన గేమ్ చేంజెస్ సినిమా అవుట్ పుట్ తో తాను సంతృప్తి చెందలేదని బాంబు పేలిచారు శంకర్. వాసవానికి ఈ సినిమా నిడివి 5 గంటల పాటు ఉందని తెలిపాడు. దాంతో ఎడిటింగ్లో మంచి మంచి సీన్లు అన్ని కట్ చేసినట్లు గుర్తు చేశారు శంకర్. దానివల్ల సినిమా అందం పోయిందని ఆయన చెప్పకనే చెప్పారు. లేకుంటే సినిమా ఇంకా బాగుండేదని ధీమా వ్యక్తం చేశారు. దీంతో శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఇది ఇలా ఉండగా... రామ్ చరణ్ హీరోగా చేసిన గేమ్ చేంజర్ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కొంతమంది సినిమా బాగుందంటే మరి కొంత మంది దారుణంగా విఫలమైందని అంటున్నారు. శంకర్ దర్శకత్వం కారణంగానే సినిమా అట్టర్ ఫ్లాఫ్ అయిందని చెబుతున్నారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కి ఆర్ అద్వానీ అలాగే తెలుగు హీరోయిన్ అంజలి నటించిన సంగతి తెలిసిందే.