గ్లోబల్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ “గేమ్ ఛేంజర్ “.. రిలీజ్ కి ముందు వరకు భారీ అంచనాలతో దూసుకొచ్చిన గేమ్ ఛేంజర్.. జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది..తొలిరోజు మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, తర్వాతి రోజుల నుంచి సినిమా వసూళ్లు తగ్గుతూ వచ్చాయి..నాల్గవ రోజు  దేశవ్యాప్తంగా ఈ సినిమా కేవలం రూ.10 కోట్ల గ్రాస్‌ను మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ.6-7 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ హిందీ వెర్షన్ లో సైతం కలెక్షన్స్ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. వీకెండ్‌లో కాస్త మెరుగైన వసూళ్లు రాబట్టినా కూడా సోమవారం వసూళ్లు రూ.1.50-1.75 కోట్ల మధ్యనే నిలిచాయి. నాలుగు రోజుల తర్వాత మొత్తం రూ.115 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే ఈ చిత్రం సాధించింది. సంక్రాంతి సీజన్ లోనే ఇలా ఉంటే మిగిలిన సమయంలో గేమ్ ఛేంజర్ ని పట్టించు కునే ప్రేక్షకుడే ఉండదేమో అనిపిస్తుంది..ఈ సినిమాతో నిర్మాత దిల్ రాజుకి భారీ నష్టాలు వచ్చాయి..

ఇదిలా ఉంటే నందమూరి నట సింహం బాలయ్య నటించిన లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ “ డాకు మహారాజ్ “.. స్టార్ డైరెక్టర్ బాబీ ఈ సినిమా తెరకెక్కించారు.. నిర్మాత నాగవంశీ నిర్మించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. స్టోరీ పాతది అయినా కానీ తమన్ ఇచ్చిన బిజీఎంకి మాత్రం సూపర్ రెస్పాన్స్ వస్తుంది.. ఈ సినిమా మొదటి రోజు ఏకంగా రూ.30 కోట్ల గ్రాస్‌ను రాబట్టి బాలయ్య కెరీర్‌లో రెండవ అతిపెద్ద ఓపెనింగ్ మూవీగా ఈ చిత్రం నిలిచింది..రెండవ రోజు కూడా దాకుమహారాజ్ అదే జోరును కొనసాగించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రెండవ రోజు రూ.13-15 కోట్ల మధ్య వసూళ్లు సాధించినట్లు తెలుస్తుంది. డాకు మహారాజ్ గ్రాస్ వసూళ్లు రూ.15-17 కోట్లుగా ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనితో ఈ చిత్రం రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా మొత్తం రూ.45 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు తెలుస్తుంది.సంక్రాంతి పండుగ సీజన్‌లో ఈ సినిమాకు మరింత కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: