చాలామంది సినీ సెలబ్రిటీలే కాకుండా, అభిమానులు కూడా సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు.. అయితే వాళ్ల సినిమాలను ఎక్కువగా న్యూమరాలజీ, అంకెల శాస్త్రం వంటివిని కూడా బాగా ఫాలో అవుతారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. వీటి విషయంలో రామ్ చరణ్ కి నమ్మకం ఉందో లేదో కానీ అభిమానులకు మాత్రం చాలా నమ్మకం ఉన్నది.అలా ఇప్పుడు రామ్ చరణ్ ఫ్లాప్ల సినిమాలకు సంబంధించి ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది.



రామ్ చరణ్ తన సినీ కెరియర్ల 15 సినిమాలలో నటించారు. అందులో సినిమాలన్నీ కూడా మూడుకి ముడి పడినట్లుగా ఫలితాలను బట్టి చూస్తే అర్థమవుతోందట. రామ్ చరణ్ సినిమాలు ఫ్లాపులన్నీ అలానే ముడి పడ్డాయట. రామ్ చరణ్ నటించిన విడుదల చేసిన రెండు సినిమాల తర్వాత కచ్చితంగా ఒక డిజాస్టర్ ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నారట రామ్ చరణ్.. అలా చిరుత, మగధీర సినిమా వచ్చిన తర్వాత ఆరంజ్ సినిమాతో ఫ్లాప్ అయ్యింది. రచ్చ, నాయక్ సినిమాలతో తర్వాత మళ్లీ జంజీర్ (ఇది ఆరో సినిమా) అనే సినిమా డిజాస్టర్ గా మిగిలింది.


ఆ తర్వాత ఎవడు తో మంచి విజయాన్ని అందుకోగా.. గోవిందుడు అందరివాడేలే, బ్రూస్లీ సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత ధ్రువ, రంగస్థలం సినిమాలు విజయాలను అందుకోగా వినయ విధేయత రామా సినిమా ప్లాప్ గా మూటకట్టుగుంది. ఆ తర్వాత rrr సినిమా వచ్చి వారి విజయాన్ని అందుకోగా రామ్ చరణ్ కెరియర్ నే టర్నింగ్ పాయింట్ అయ్యేలా చేసింది. ఆ తర్వాత రామ్ చరణ్, చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఇబ్బంది పెట్టగా.. ఇప్పుడు రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా కూడా ఇబ్బంది పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ సెంటిమెంట్ ఎంత మటుకు నిజమో చూడాలి మరి. తన తదుపరిచిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్, బుచ్చిబాబు ఒక సినిమాలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: