ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు తాజాగా డాకు మహారాజ్ సినిమా యూఎస్ఏ లో బాక్సాఫీస్ వద్ద..6.50 కోట్ల రూపాయలు అందుకున్నదట..(అంటే వన్ మిలియన్ డాలర్ మార్క్) దీంతో బాలయ్య ఇప్పటివరకు అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి సినిమాల తర్వాత మళ్లీ మిలియన్ డాలర్ మార్కును అందుకున్న నాలుగవ సినిమాగా డాకు మహారాజ్ నిలిచింది. ఇలా వరుసగా అమెరికాలో 4 సినిమాలు మిలియన్ డాలర్ మార్క్ అందుకుంటున్న ఏకైక టాలీవుడ్ హీరోగా బాలయ్య సరికొత్త అరుదైన రికార్డును సైతం సొంతం చేసుకున్నట్లు వినిపిస్తూ ఉండడంతో బాలయ్య అభిమానులు ఈ విషయాన్ని తెగ వైరల్ గా చేస్తున్నారు.
సీనియర్ హీరో అయినప్పటికీ కూడా బాలకృష్ణ ఇలాంటి రేర్ రికార్డు సంపాదించడం అంటే చాలా కష్టమని కూడా చెప్పవచ్చు.. మరి సంక్రాంతికి విడుదలైన వెంకటేష్ సినిమా కూడా మరి యూఎస్ఏ లో బాక్సాఫీస్ వద్ద బాలయ్య మార్క్ ను దాటేస్తుందేమో చూడాలి. ఇక బాలయ్య తదుపరిచిత్రం అఖండ 2 సినిమాలో తన విశ్వరూపాన్ని చూపిస్తానంటూ ఇటీవలే వెల్లడించడం జరిగింది. గత మూడు సినిమాల నుంచి తమన్ సంగీతాన్ని అద్భుతంగా అందిస్తూ ఉండడంతో కచ్చితంగా అఖండ 2 చిత్రానికి కూడా తమన్ సంగీతాన్ని అందిస్తారనే నమ్మకం అభిమానులలో ఉన్నది. మరి ఈ సినిమా షూటింగ్ కూడా కుంభమేళలో ప్రారంభించే విధంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్లాన్ చేశారు.