భారీ అంచనాలతో వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ డిజాస్టర్ అయింది.తక్కువ బడ్జెట్ తో వచ్చి భారీ హిట్టు కొట్టింది సంక్రాంతికి వస్తున్నాం మూవీ.ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ సినిమాపై ఎన్నో మీమ్స్,ట్రోల్స్ వస్తున్నాయి. అయితే అగ్నికి ఆజ్యం పోసేలా అన్నట్లు గేమ్ ఛేంజర్ కి నెగిటివ్ టాక్ వస్తున్న వేళ అనిల్ రావిపూడి మాట్లాడిన మాటలు గేమ్ చేంజర్ సినిమాపై, డైరెక్టర్ పై సెటైర్లు వేసినట్టే కనిపిస్తున్నాయి. మరి ఇంతకీ అనిల్ రావిపూడి ఏం మాట్లాడారు.. ఎందుకు ఆ మాటలు శంకర్ పై కన్వర్ట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది సంక్రాంతి బరిలో ముగ్గురు పెద్ద హీరోలు వాళ్ళ సినిమాలతో వచ్చారు. అలా రామ్ చరణ్ గేమ్ చేంజర్ బాలకృష్ణ డాకు మహారాజ్,వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం ఈ మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఈ మూడు సినిమాల్లో డాకు మహారాజ్ విన్నర్, సంక్రాంతికి వస్తున్నాం రన్నర్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. 

యాక్షన్ సినిమాలు చూసేవారికి డాకు మహారాజ్ మూవీ చూడవచ్చని, అలాగే ఫన్ అండ్ ఎంజాయ్ కావాలంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూడొచ్చు అని ఎంతోమంది ఈ సినిమాలు చూసి రివ్యూ ఇస్తున్నారు. అయితే తాజాగా సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో అనిల్ రావిపూడి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. నేను ఎప్పుడైనా సరే ఓ సినిమాను తెరకెక్కించే సమయానికి ఆ సినిమాకి పెట్టే బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.నేను ఏ హీరోతో తీస్తానో ఆ హీరోకి మార్కెట్లో ఎలాంటి రేంజ్ ఉంది.ఆయన సినిమాకి ఎంత బడ్జెట్  అనేది ముందుగానే దృష్టిలో పెట్టుకుంటాను. అలాగే ఆ సినిమాకి ఆ బడ్జెట్ పెడితే నిర్మాతకు లాభాలు వస్తాయా..నిర్మాత సేఫ్ ప్లేస్ లో ఉంటారా అనేది కచ్చితంగా చూసుకుంటాను. ఇండస్ట్రీలో క్రేజ్ ఉంటే సరిపోదు.

అలాగే డబ్బులు ఎవరికి ఊరికే రావు.వాళ్ళు కూడా కష్టపడే సంపాదిస్తారు. అందుకే ఒకరి డబ్బులు ఖర్చు పెట్టే సమయంలో ఎంతో ఆలోచించాలి.అలాగే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆటలు ఆడకూడదు.నువ్వు సంపాదించిన డబ్బును ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు. కానీ వేరే వాళ్ళ డబ్బులు ఆలోచించి ఖర్చు పెట్టాలి అంటూ అనిల్ రావిపూడి సంచలన కామెంట్లు చేశారు. అయితే అనిల్ రావిపూడి చేసిన కామెంట్లను గేమ్ చేంజర్ డైరెక్టర్ శంకర్ పైకి కన్వర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే శంకర్ గేమ్  చేంజర్ మూవీకి డబ్బులు మంచినీళ్లలా ఖర్చు పెట్టారని, ఒక్కో పాటకు 75 కోట్లు పెట్టి తీసి అనవసరమైన బడ్జెట్ ని దిల్ రాజుతో పెట్టించారని ఇప్పడికే ఎంతోమంది కామెంట్స్ పెడుతున్నారు. అలాగే అనిల్ రావిపూడి మాటలు శంకర్ కి కరెక్ట్ గా సెట్ అయ్యాయి అంటూ కొంతమంది నెటిజన్స్ ఈ వాక్యాలు వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: