మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రలలో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకు గానూ నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో తండ్రి పాత్రలో నటించిన రామ్ చరణ్ కి జోడిగా అంజలి నటించగా , కొడుకు పాత్రలో నటించిన చరణ్ కు జోడిగా కియార అద్వానీ నటించింది.

శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించగా ... ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో నటించాడు. శ్రీకాంత్ , సునీల్ , నవీన్ చంద్ర , జయరాం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు మొదటి రోజు నుండి బాక్సా ఫీస్ దగ్గర పెద్ద ఎత్తున కష్టాలు ఎదురవుతూ వస్తున్నాయి. ఓ వైపు ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మరికొన్ని క్రేజీ సినిమాలు కూడా విడుదల అవుతూ ఉండడం , వాటికి మంచి పాజిటివ్ టాక్స్ వస్తూ ఉండడంతో ఈ సినిమా కలెక్షన్లు మరి తగ్గుతూ వచ్చాయి.

ఇకపోతే నిన్న మాత్రం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే బుక్ మై షో ప్లాట్ ఫామ్ లో కూడా ఈ సినిమా నిన్న మంచి సేల్స్ ను జరుపుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా బుక్ మై షో యాప్ వారు ఈ సినిమా టికెట్లు లాస్ట్ 24 గంటల్లో 133.86 కే సేల్ అయినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇలా విడుదల రోజు నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రగుల్ అవుతున్న గేమ్ చేంజర్ నిన్న కాస్త మంచి కలెక్షన్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి అని దీని ద్వారా చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: