ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోలు ఎవరో ఒక డైరెక్టర్ తో ఫేమస్ అయినవారే.. అలా మహేష్ బాబు, రవితేజ,పవన్ కళ్యాణ్ వంటి హీరోలకు ఇండస్ట్రీలో స్టార్ డం తెచ్చిందే పూరి జగన్నాథ్. ఒకప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చాలామంది హీరోలు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా మారిపోయారు.అలా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మహేష్ బాబు, రవితేజ,పవన్ కళ్యాణ్ వంటి హీరోలు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగారు. పూరి జగన్నాథ్ తో ఈ సినిమాలు ఆ హీరోలు గనుక చేయకపోయి ఉంటే ఇప్పటికీ మిడిల్ రేంజ్ హీరోలు గానే ఉండిపోయేవారు. కానీ పూరి జగన్నాథ్ తన డైరెక్షన్ తో మ్యాజిక్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక పూరి జగన్నాథ్ లాగే మరో డైరెక్టర్ ఉన్నారు ఆయనే శంకర్.  డైరెక్టర్ శంకర్ తమిళంలోనే ఎక్కువ సినిమాలు తీసినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన దర్శకుడు. ఎందుకంటే ఈయన తమిళంలో తీసిన చాలా సినిమాలు తెలుగులో బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.

అలా భారతీయుడు, జీన్స్, ప్రేమికుడు, ఒకే ఒక్కడు,జెంటిల్మెన్, రోబో, శివాజీ వంటి సినిమాలతో ఎంతమందికి చెమటలు పట్టించారు డైరెక్టర్ శంకర్. ఈయన తన దర్శకత్వ ప్రతిభతో ఎంతో మంది హీరోలను ఇండియన్ సినీ హిస్టరీలో మంచి పొజిషన్ లో తీసుకొచ్చి పెట్టారు. అయితే అలా హీరోలను ఎంతో పెద్ద స్థాయికి తీసుకువెళ్లిన డైరెక్టర్ పూరి జగన్నాథ్, డైరెక్టర్ శంకర్ ఇద్దరికీ కూడా ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాప్స్ వస్తున్నాయి. శంకర్ తెరకెక్కించిన గేమ్ చేంజర్, భారతీయుడు టు వంటి రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్. అలాగే పూరి జగన్నాథ్ ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాప్స్ ఎదుర్కొంటున్నారు. లైగర్, డబల్ ఇస్మార్ట్ వంటి సినిమాలు పెద్ద ప్లాఫ్ అయ్యాయి. ఒక ఇస్మార్ట్ శంకర్ తప్ప పూరి జగన్నాథ్ ఈ మధ్యకాలంలో తీసిన సినిమాలన్నీ ప్లాపే..దాంతో ఇండియన్ సినీ హిస్టరీకి ఎంతో మంది స్టార్ హీరోలను పరిచయం చేసిన ఇద్దరు డైరెక్టర్లకు ఏమైంది..

వీరి డైరెక్షన్లో మ్యాజిక్ ఎందుకు మిస్ అవుతుంది.. ఎందుకు మంచి సినిమాలు తీసుకురావడం లేదు అంటూ చాలామంది అభిమానులు నిరాశ పడుతున్నారు. అయితే ఇప్పటి జనరేషన్ కి తగ్గట్టు వీరిద్దరూ సినిమాలు చేయట్లేదని, వీరి డైరెక్షన్ లో ఎక్కడో ఒక చోట మ్యాజిక్ మిస్ అవుతుంది అనే టాక్ కూడా వినిపిస్తుంది. అందుకే వీరిద్దరూ ఎక్కడ లోపం జరుగుతుందో చూసుకొని సినిమా డైరెక్షన్ విషయంలో ఆచి తూచి అడుగులు వేయాలి అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అంతే కాదు మళ్ళీ వీరి డైరెక్షన్లో మంచి మంచి సినిమాలు రావాలని ఒకప్పటి పూరి జగన్నాథ్,శంకర్ లు మాకు కావాలి అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.మరి ఇప్పటికైనా అభిమానుల అభిరుచి ఎలా ఉందో తెలుసుకొని జనరేషన్ కి తగ్గట్టు సినిమాలు చేస్తూ మళ్ళీ ఈ ఇద్దరు డైరెక్టర్లు సినిమాల్లో కంబ్యాక్ ఇస్తారా.. లేదా మళ్లీ పాత చింతకాయ పచ్చడి లాగే సినిమాలు చేస్తారా అనేది చూడాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: