ఏంటి రీతు వర్మ కి పవన్ కళ్యాణ్ లవ్ యు డియర్ అంటూ కామెంట్ పెట్టడమా.. ఇదెక్కడి మ్యాటర్ అంటూ చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ ఉన్నారు.ఇంతకీ రీతూ వర్మకి పవన్ కళ్యాణ్ కి మధ్య ఎక్కడ పరిచయం కుదిరింది అని చాలామంది సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ కి రీతూ వర్మ కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి..రీతూ వర్మ ఫోటోకి పవన్ కళ్యాణ్ కామెంట్ పెట్టడం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. టాలీవుడ్ నటి రీతూ వర్మ పెళ్లి చూపులు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో రీతూ వర్మకి సినిమాలో ఆఫర్స్ వచ్చాయి.. అలా రీతూ వర్మ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ ఈమె నటించిన సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ది సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఈ నటికి ఇండస్ట్రీలో పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు రావడం లేదు.ఇక ఈ మధ్యనే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న మజాకా సినిమాలో సందీప్ కిషన్ కి హీరోయిన్గా చేసే అవకాశం వచ్చింది.

 ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా రీతు వర్మ తనకి సంబంధించిన క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో పంచుకుంది. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా రీతూ వర్మ తెలుగుతనం ఉట్టిపడేలా సాంప్రదాయ బద్ధంగా చీర కట్టుకొని తన అభిమానులు అందరికీ హ్యాపీ పొంగల్ అంటూ క్యాషన్ పెట్టి తనకి సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.అయితే ఈ ఫోటోలను చూసి ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్ ఫీదా అయిపోయారు. ఇక అందులో ఒక వ్యక్తి అయితే ఐ లవ్ యూ డియర్ అంటూ రీతూ వర్మ ఫోటోలకి కామెంట్ పెట్టాడు.అయితే ఆ వ్యక్తి పేరు పవన్ కళ్యాణ్ ఆ యూసర్ డిస్ప్లే నేమ్ కూడా అడిక్ట్ టు పీకే అని ఉంది.దీంతో ఈ కామెంట్ చూసిన చాలా మంది నెటిజన్లు  పవన్ కళ్యాణ్ రీతూ వర్మకి ఐ లవ్ యు డియర్ అంటూ కామెంట్ పెట్టారు అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ అంటే అందరూ హీరో పవన్ కళ్యాణ్ అనుకుంటారు. కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకున్న ఓ యూజర్.. ప్రస్తుతం ఆ అభిమాని పెట్టిన కామెంట్ నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇక రీతూ వర్మ విషయానికి వస్తే.. రీతు వర్మకి మెగా ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉన్నాయని,మెగా ఫ్యామిలీలోని వైష్ణవ్ తేజ్ తో రీతు వర్మ డేటింగ్ లో ఉందని, అందుకే మెగా ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్ లలో ఈమె కూడా కనిపిస్తుందనే రూమర్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: