ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా గేమ్ చేంజర్ , డాకు మహారాజ్ , సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల అయ్యాయి. ఈ సంవత్సరం సంక్రాంతి పోటీలో మొదటగా రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ జనవరి 10 వ తేదీన విడుదల కాగా , బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజ్ సైనా జనవరి 12 వ తేదీన విడుదల అయింది. ఇక విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిన్న అనగా జనవరి 14 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ మూడు సినిమాలలో గేమ్ చేంజర్ సినిమాకు నెగిటివ్ టాక్ రాగా డాకు మహారాజ్ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది.

అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఇప్పటివరకు ఈ సినిమాలకు వచ్చిన టాక్ ను బట్టి చూస్తే గేమ్ చేంజర్ సినిమా పాన్ ఇండియా మూవీ గా విడుదల కావడంతో ఈ రెండు సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసిన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా డాకు మహారాజ్ , సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్లను బీట్ చేయడం కష్టం అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

డాకు మహారాజ్ , సంక్రాంతికి వస్తున్నాం సినిమాల మధ్య తెలుగు రాష్ట్రాల్లో గట్టి పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి అని , ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుంది అని అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి విన్నర్ గా నిలిచే సినిమా ఏది అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే అని , అలా మరికొన్ని రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయితేనే ఈ రెండు మూవీలలో ఏ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుంది అనేది ఫుల్ గా క్లారిటీ వస్తుంది అని ట్రేడ్ పండితులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: