ప్రస్తుతం సంక్రాంతి పండుగ హడావిడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మూడు బడా తెలుగు సినిమాలు... ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన గేమ్ చేంజర్ మొదట రిలీజ్ కాగా ఆ తర్వాత బాలయ్య నటించిన డాకు మహారాజు సినిమా రిలీజ్ అయింది. ఇక లేటెస్ట్ గా అంటే నిన్నటి రోజున వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయి రచ్చ చేస్తుంది.

 అయితే ఈ మూడు సినిమాలలో... గేమ్ చేంజర్ సినిమా మాత్రం.... కాస్త వెనుకబడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  దీనికి కారణం దర్శకుడు శంకర అని తెలుస్తోంది. రామ్ చరణ్ ను సరిగ్గా వాడుకోలేక శంకర్ విఫలమైనట్లు సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది.  అయితే ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కలెక్షన్లు కూడా భారీగా తగ్గినట్లు చెబుతున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పని చేసిన సంగతి తెలిసిందే.

 అయితే ఈ సినిమా కలెక్షన్లు భారీగా తగ్గడంతో దిల్ రాజు నష్టపోయాడని కొంతమంది అంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అలా కనిపించడం లేదు. సంక్రాంతి పండుగ ఉన్న నేపథ్యంలో గేమ్ చేoజర్ కలెక్షన్స్... క్రమక్రమంగా పెరుగుతున్నట్లు చెబుతున్నాయి లెక్కలు. గడిచిన ఐదు రోజుల్లో 60 నుంచి 65% బిజినెస్ అయిందట. మరో 30 శాతం బిజినెస్ జరిగితే.... గేమ్ చేంజర్ బయటపడినట్లే అని చెబుతున్నారు.

 ఇక గడిచిన 24 గంటల్లో... 136.14k టికెట్లు గేమ్ చేంజర్ వి అమ్మడు అయ్యాయి. అలాగే మొదటి రోజున నాలుగు లక్షలకు పైగా ఈ సినిమాను చూశారు. రెండవ రోజు వచ్చేసరికి  మూడు లక్షలకు పైగా... ఈ సినిమా చూడడం జరిగింది. ఇక మూడవరోజు వచ్చేసరికి రెండు లక్షలకు పైగా జనాలు సినిమాలు చూడడం జరిగింది.  నాలుగో రోజు వచ్చేసరికి లక్ష 30 వేల మంది సినిమా చూడడం జరిగింది. అయితే నిన్నటి రోజున... లక్ష 36 వేలకు పైగా టికెట్లు అమ్ముడు అయ్యాయని.. లెక్కలు చెబుతున్నాయి. ఆదివారం వరకు.. గేమ్ చేంజర్.. లాభాల్లోకి వస్తుందని కూడా కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: