అయిపోయింది.. రామ్ చరణ్ తో సినిమా.. రామ్ చరణ్ తో సినిమా అన్నారు . శంకర్ ఎట్టకేలకు రాంచరణ్ తో సినిమా తీసి రాంచరణ్ ఖాతాలో సక్సెస్ఫుల్ గా ఫ్లాప్ మూవీ వేశారు.   రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్  కాస్త తగ్గించేశారు.  ప్రజెంట్ ఈ కామెంట్స్ ఎంత వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే . కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా 'గేమ్ చేంజర్' సినిమా జనవరి 10వ తేదీ రిలీజ్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అల్లాడించేస్తుంది అని అంతా ఎక్స్పెక్ట్ చేశారు . కానీ సినిమాకి అంత సీన్ లేదు . యావరేజ్ అంటూ కొట్టి పడేశారు జనాలు.  ఫాన్స్ కూడా కొంచెం నెగిటివ్ గా మాట్లాడుతుండడం శంకర్ డైరెక్షన్ కి పెద్ద పరీక్ష పెట్టినట్లయింది.


చరణ్ నటన బాగుంది అని ..సినిమాకి డైరెక్షన్ బాగోలేదు అంటూ కామెంట్స్ వినిపించాయి . కలెక్షన్స్ పరంగా ముందుకు వెళుతున్న కూడా మాత్రం టాక్ ప్రకారం వెనకడుగు వేస్తుంది ఈ గేమ్ చేంజర్.  ఈ సినిమాతో రామ్ చరణ్ కి ఫ్లాప్ ఇచ్చిన తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు..? ఏ హీరో కెరియర్ని బలి తీసుకోబోతున్నాడు..? అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది . కాగా  శంకర్ ఖాతాలో నెక్స్ట్ బలి అయిపోయే ది కూడా మరో తెలుగు హీరోనే అంటూ టాక్ వినిపిస్తుంది.  అందుతున్న సమాచారం ప్రకారం ..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ సూర్యతో నెక్స్ట్ ప్రాజెక్ట్ తెరకెక్కించాలి అంటూ అనుకున్నారు. కానీ సూర్య కొన్ని కారణాల చేత ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆ ప్లేస్ లో ..మహేఅశ్ ని  తీసుకురావాలని ఆలోచిస్తున్నారట .



అయితే మహేష్ బాబు ..రాజమౌళి చేతుల్లో ఇరుకున్నాడు . ఇంకో రెండు మూడేళ్ల వరకు బయటకు రాలేడూ. ఈ రెండు మూడు ఏళ్ల వరకు ఆయన గ్యాప్ తీసుకొని .. ఆ తర్వాత ఫ్రెష్ కంటెంట్ తో ఆయన ఎంతో ప్రెస్టీజ్ గా ఫీల్ అవుతున్న డ్రీం ప్రాజెక్టు మహేష్ బాబుని తెరపై చూపించాలనుకుంటున్నాడట . ఆశ్చర్యమేంటంటే మహేష్ బాబు కూడా అందుకు ఓకే చెప్పారట . దీంతో ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . గ్లోబల్ స్టార్ కి ఇంత ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కి ఎలా ఛాన్స్ ఇచ్చావు..? అంటూ ప్రశ్నిస్తున్నారు . అయితే మహేష్ బాబు ఏ పని చేసిన సరే ఒకటికి వందసార్లు ఆలోచించుకొని చేస్తాడు అని.. ఖచ్చితంగా శంకర్ దర్శకత్వం లో సినిమాకి కమిట్ అవ్వడం వెనక ఏదో రీజన్ ఉంది అంటూ మాట్లాడుతున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: