గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీకి మిక్స్డ్ టాక్ వస్తోంది. భారీ అంచనాల మధ్య జనవరి 10వ తేదీన ఈ చిత్రం రిలీజ్ అయింది. సంక్రాంతి బరిలోకి ఈ పొలిటికల్ మూవీ అడుగుపెట్టింది.ఈ క్రమంలో ఒకవైపు మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నా కూడా మరోవైపు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతుంది.భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి ఓవర్ బడ్జెట్ పెట్టారనే టాక్ కూడా వినిపిస్తుంది. డైరెక్టర్ శంకర్ బడ్జెట్ ను మంచి నీళ్లలాగ ఖర్చు చేయించారనే టాక్ మొదటి రోజు నుంచి వినిపిస్తుంది.. ఇప్పుడు బడ్జెట్ డీటెయిల్స్ చర్చనీయాంశంగా మారింది. మూవీకి 450 కోట్లు ఖర్చు అయిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఈ బడ్జెట్ కు ఇంట్రెస్ట్ 100 కోట్లట.. మొదట 130 రోజులు అనుకున్నారట.. కానీ 350 రోజులు, 3 ఇయర్స్ షూటింగ్ పెరగడంతో ఇంట్రెస్ట్ కూడా పెరిగిందట.

ఇంత బడ్జెట్ కు కారణం శంకర్ అని వార్తలు వినిపిస్తున్నాయి. అనుకున్న టైమ్ లో ఫినిష్ చేస్తే ఇంత బడ్జెట్ అవసరం ఉండేది కాదని అంటున్నారు. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే టీమ్ రెస్పాండ్ అవ్వాలి. ఇదిలావుండగా కంటెంట్ పరంగా సినిమా నిరాశకి గురి చేసి ఉండొచ్చు కానీ, ఓవరాల్ వసూళ్ల పరంగా మాత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఉంది.ఓవరాల్ గా నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందంటే నైజాం ప్రాంతంలో ఈ చిత్రానికి దాదాపుగా 43 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నాలుగు రోజులకు గాను 16 కోట్ల 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో 25 నుండి 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అక్కడి ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా సీడెడ్ లో ఈ చిత్రానికి నాలుగు రోజులకు గాను 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. 

ఫుల్ రన్ లో ఇక్కడ 15 కోట్ల రూపాయిల వరకు రావొచ్చని అంచనా. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం లో నాలుగు రోజులకు 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి, గుంటూరు జిల్లాలో 6 కోట్ల రూపాయిలు, కృష్ణ జిల్లాలో 4 కోట్ల 20 లక్షల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో 3 కోట్ల 15 లక్షలు రాబట్టింది.అదే విధంగా ఉభయగోదావరి జిల్లాలు కలిపి 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 56 కోట్ల 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక లో 4 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, తమిళనాడు 3 కోట్ల 15 లక్షలు, కేరళలో పాతిక లక్షలు, నార్త్ ఇండియా లో 15 కోట్లు రూపాయిలు, ఓవర్సీస్ లో 13 కోట్ల రూపాయిలు, ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 92 కోట్ల 63 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 162 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. డిజాస్టర్ టాక్ తోనే ఈ చిత్రం వంద కోట్ల షేర్ మార్కుని అందుకోబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: