స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఇటీవల గ్రాండ్ గా రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ లుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు భీమ్స్ మంచి మ్యూజిక్ అందించారు. 18 ఏళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్, రమణ గోగుల కాంబో మళ్లీ వస్తోంది. అయితే వెంకీ మామ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా స్టోరీ లైన్ కూడా అదిరిపోయింది.
ఇదిలా ఉండగా.. ఇటీవల విడుదల అయిన
 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా థియేటర్స్‌లో  బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ని తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో ఉన్న బుడ్డోడు కూడా ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాలో నటించిన అన్ని పాత్రలు ఒక లెక్కైతే చిన్నరాజు (వెంకటేష్) కొడుకు బుల్లిరాజు పాత్ర మరోఎత్తు. ఇక ఈ బుడ్డోది నటన విషయానికి వస్తే.. వాడి నటనతో అందరినీ నవ్వించాడు. ఈ బుడ్డోడి అసలు పేరు భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్. ఇక ఈ సినిమాలో ఈ బుడ్డోడి పాత్ర తన తండ్రిని ఎవరైనా ఏమైనా అంటే చాలు బొమ్మ బొరుసు అయిపోద్ధి. వీడు గోదారి యాసలో తిట్టే తిట్లకు ఊరి వాళ్లకి చెవులు చిల్లులుపడితే.. ఆడియన్స్‌కి మాత్రం పొట్టచెక్కలు అవుతుంది.
ఈ బుడ్డోడు మంచి నటుడే కాదు.. మంచి మాటకారి కూడా.. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ బుడ్డోడు మాట్లాడుతూ.. 'నేను ఈ సినిమాలో వెంకటేష్ గారి సన్ క్యారెక్టర్ చేశాను. ఆయన లాంటి గొప్ప యాక్టర్‌తో నటించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయనతో నటించిన మూమెంట్స్ నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను. నాకు ఈ సినిమాలో ఇంత మంచి అవకాశం ఇచ్చిన అనీల్ రావిపూడి సార్‌కి బిగ్ థాంక్స్. పటాస్ మూవీ నుంచి నేను అనీల్ సార్‌కి పెద్ద ఫ్యాన్‌ని. మీనాక్షి మేడమ్, ఐశ్వర్య మేడమ్‌తో బాగా ఎంజాయ్ చేశాను. మేం సంక్రాంతికి వస్తున్నాం.. మీరు కూడా థియేటర్స్‌కి సంక్రాంతికి వచ్చేయండి' అంటూ క్యూట్ స్పీచ్‌తో బుడ్డోడు గట్టోడే అని అనిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: