టాలీవుడ్‌లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ వివాదాలకు దూరంగా ఉంటారు. తన పని తాను చేసుకుపోతూ ఉంటారు అన్న పేరు ఉంది. వెంకటేష్ సినీ కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. అయితే హీరోయిన్లతో వెంకటేష్ చాలా క్లోజ్‌గా ఉంటూ.. తన పని తాను చేసుకుపోతూ ఉంటారు. తాజాగా వెంకటేష్ ఈ సంక్రాంతికి.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించారు. హీరోయిన్ల విషయంలో ఎప్పుడు వెంకటేష్ పై ఎలాంటి రూమర్‌లు, విమర్శలు లేవు.


అయితే నలుగురు హీరోయిన్ల విషయంలో మాత్రం కొన్ని వివాదాలు ఆయనను చుట్టుముట్టాయి. ఆ హీరోయిన్లతో రకరకాల విషయాలలో వెంకటేష్‌కు గొడవలు వచ్చాయని.. ఈ హీరోయిన్లలో కొందరితో ఇప్పటికీ వెంకటేష్‌కు మాటలు లేవన్న టాక్‌ ఇండస్ట్రీలో ఉంది. వెంకటేష్, రోజా కాంబినేషన్‌లో పోకిరి రాజా సినిమా తెర‌కెక్కింది. ఆ తర్వాత ఒక తమిళ సినిమా రీమేక్‌ చేస్తున్నప్పుడు అక్కడ నటించిన రోజునే తెలుగులో వెంకటేష్ పక్కన జోడిగా తీసుకోవాలని నిర్మాతలు అనుకున్నారట. అదే టైంలో సౌందర్య, వెంకటేష్ జోడికి మార్కెట్ బాగుంది. నిర్మాతలు రోజాకు బదులు చివరలో సౌందర్యను తెరమీదకు తెచ్చారు.


వెంకటేష్ కావాలని తనను తెప్పించారన్న భావనతో.. రోజా ఇప్పటికీ వెంకటేష్‌తో మాట్లాడదని అంటారు. వెంకటేష్‌తో మల్లీశ్వరి సినిమా టైంలో కత్రినా కైఫ్ షూటింగ్ సగం జరిగాక.. తనకు ఎక్కువ రెమ్యూనరేషన్ కావాలని పట్టుబట్టింద‌ని.. ఆ టైంలో వెంకటేష్‌కు ఆమెకు మధ్య గొడవ జరిగిందని అంటారు. ఇక మరో హీరోయిన్ నిత్య మీన‌న్‌ ఒక సినిమాలో వెంకటేష్ పక్కన హీరోయిన్గా చేయాలన్న ఆఫర్ వెళ్ళినప్పుడు.. అంకుల్ పక్కన నేను హీరోయిన్గా నటించడం ఏంటి ? అని అనడంతో వెంకటేష్ బాగా ఫీలయ్యారన్న ప్రచారం ఇండస్ట్రీలో జరిగింది. అలాగే మరో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, వెంకటేష్ కాంబినేషన్లో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. ఒక షూటింగ్ టైంలో విరిద్దరి మధ్య స్వల్ప వివాదం జరిగిందని.. ఆ తర్వాత వీరిద్దరూ అన్నీ మర్చిపోయి ఇప్పటికి మంచి స్నేహితులుగా ఉంటున్నారని టాక్ అయితే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: