సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. చాలా కాలం తర్వాత వెంకటేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
అయితే ఇదిలా ఉండగా.. 25 ఏళ్ల క్రితం వెంకటేష్ నుంచి ఓ కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు అదే ఫ్యామిలీ బ్లాక్ బస్టర్‌ని వెంకటేష్ రిపీట్ చేశారంటూ చర్చలు జరుగుతున్నాయి. అదేనండీ 2000లో జనవరి 14న సంక్రాంతి కానుకగా కలిసుందాం రా అనే చిత్రం రిలీజ్ అయింది. ఆ సమయంలో ఈ చిత్రం సృష్టించిన ట్రెండ్ అంతా ఇంతా కాదు. వెంకటేష్-సిమ్రాన్ జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పటికీ ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న క్రేజ్ తగ్గలేదు. సరిగ్గా ఈ చిత్రం రిలీజైన 25 ఏళ్లకి ఇప్పుడు అదే రోజు సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకటేష్ వచ్చి మరో విక్టరీ అందుకున్నారు.
ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్లకి రప్పించడం చూసి అప్పటి కలిసుందాం రా రోజులను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ లుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.