- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన కెరీర్‌లో ఎంతోమంది హీరోయిన్లతో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు. మరీ ముఖ్యంగా.. 1980 లలో శ్రీదేవి లాంటి హీరోయిన్‌తో మొదలుపెట్టి.. ఆ తర్వాత తరంలో నగ్మా, మీనా, రమ్యకృష్ణ ఆ తర్వాత నయనతార, శ్రేయ.. ఇప్పుడు తమన్నా రాధిక ఆప్టే లాంటి హీరోయిన్లతో కూడా జోడి కట్టిన ఘనత రజనీకాంత్ సొంతం. ఎప్పటికైనా వయసుకు ఏడుప‌దుల‌ చేరువవుతున్న రజనీకాంత్ సినిమా వస్తుందంటే.. దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో తెలిసిందే.


రజనీకాంత్, శ్రీదేవి కాంబినేషన్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరిద్దరి జోడి కి అప్పట్లో తిరుగులేని  క్రేజ్‌సొంతం చేసుకుంది. తెలుగులోనూ రజనీకాంత్, శ్రీదేవి జోడి క‌ట్టిన సినిమాలు బాగా ఆడాయి. ప్రజలు పెళ్లికి ముందు శ్రీదేవి ఇంటికి తరచూ వెళ్లేవారట. అప్పటికే శ్రీదేవి.. కమలహాసన్ ప్రేమలో పడి మోసపోయింది. కమలహాసన్ తనకు హ్యాండ్ ఇవ్వడంతో.. ఆమె రజినీని గుడ్డిగా నమ్మేసి.. తన ఇంటికి తరచూ వస్తూ ఉండడంతో ప్రేమలో పడిపోయిందట.


రజనీ తన‌ను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని ఆమె హోప్స్ పెట్టుకుందట. ఒకరోజు రజినీని పెళ్లి చేసుకోమని శ్రీదేవి ప్రపోజల్ పెట్టగా.. రజనీ మాత్రం నీ మీద నాకు ఆ ఉద్దేశం లేదని.. మీ చెల్లిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడట. వెంటనే శ్రీదేవికి పట్టరాని కోపం, బాధ వచ్చేసాయట. రజినీ తనతో స్నేహంగా ఉంటూ.. తన చెల్లిని ఎలా పెళ్లి చేసుకుంటాడు అంటూ తీవ్రంగా తనలో తాను మదనపడిపోయిందట. అప్పటి నుంచి రజినీని శ్రీదేవి దూరం పెట్టేసిందని.. తమిళనాడు మీడియా కోడై కూసింది .. తర్వాత వారిద్దరి మధ్య బాగా గ్యాప్ పెరిగిపోయింది అన్న ప్రచారం అప్పట్లో వినిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: