జగపతిబాబు గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ఏ పాత్రను అయినా అవలీల‌గా చేయగల దిగ్గజ నటుడు జగపతిబాబు. గాయం, శుభలగ్నం, మావిచిగురు, పెళ్లి పందిరి, అంతపురం, బడ్జెట్ పద్మనాభం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఫ్యామిలీ హీరోగా కాకుండా.. విలక్షన న‌టుడిగా కూడా జగపతిబాబు పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం జగపతిబాబు ఈతరం హీరోల పక్కన రంగస్థలం లాంటి భారీ బడ్జెట్ సినిమాలలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.


వ్యక్తిగతంగా కూడా జగపతిబాబు సినీ కుటుంబ నేపథ్యం నుంచి రావడంతో ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. జగపతిబాబు కెరీర్ ప్రారంభంలో హీరోయిన్‌ల‌తో ఎఫైర్‌లు నడిపినట్టు ప్రచారం జరిగింది. అలాగే సినిమాల ద్వారా సంపాదించిన కోట్ల ఆస్తిని జగపతిబాబు చాలావరకు పోగొట్టుకున్నాడని అంటారు. లెజెండ్ సినిమాతో విలన్ గా నటించి రీఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నాడు జగపతిబాబు. ఒకానొక టైంలో దివంగత హీరోయిన్ సౌందర్యతో ప్రేమాయ‌ణం నడిపినట్టు వార్తలు ఉన్నాయి. అలాగే యమదొంగ హీరోయిన్ ప్రియమణితోను గాఢమైన ప్రేమాయణం నడిపించాడని అంటారు.


ఈ ముద్దుగుమ్మ జగ్గు భాయ్‌తో కలిసి పెళ్లయిన కొత్తలో సినిమా చేసింది. ఇందులో వీరు ఇంటెన్స్‌ రొమాంటిక్ సీన్లలో నటించారు. అప్పుడే వారి మధ్య ఎఫైర్ మొదలైందని అంటారు. ఈ సినిమా తర్వాత కూడా ప్రవరాఖ్యుడు, సాధ్యం, క్షేత్రం లాంటి సినిమాలలో మళ్లీ జత కట్టారు. అలా నాలుగు సినిమాలు కలిసి చేయడంతో వీళ్ళిద్దరూ బాగా దగ్గరయ్యారని కొన్నాళ్లపాటు.. సీక్రెట్ రిలేష‌న్‌షిప్ మైంటైన్ చేశారని సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఒకానొక టైంలో ప్రియమణి సైతం తామిద్దరం మంచి స్నేహితులు మాత్రమే అని తెలిపింది. అయితే.. జగపతిబాబు, ప్రియమ‌ణి విషయంలో ఈ రూమర్లు మాత్రం గట్టిగా వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: