- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


దాదాపు 3 దశాబ్దాలపాటు .. తెలుగు సినిమా పరిశ్రమలో మాత్రమే కాకుండా.. సౌత్ ఇండియాలో తిరుగులేని స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు రమ్యకృష్ణ. తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించింది. విల‌క్షణ దర్శకుడు కృష్ణవంశీని పెళ్లి చేసుకుని.. . ఒక బాబు పుట్టాక సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇప్పటికీ ఇండస్ట్రీలో బిజీగా కొనసాగుతున్నారు రమ్యకృష్ణ. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ఎన్నో కోట్ల రూపాయల ఆస్తి సంపాదించారు రమ్యకృష్ణ. .


కేవలం హీరోయిన్‌గానే కాకుండా.. స్పెషల్ సాంగ్స్ అలాగే.. నర‌సింహా , నీలాంబ‌రి లాంటి సినిమాలలో నెగిటివ్ పాత్రలు కూడా నటించి తన నటనతో అందరిని మెప్పించారు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకు అత్తగా కూడా నటించారు. సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మ, అత్త పాత్రలో నటిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. బాహుబలి సిరీస్ సినిమాలో పాన్ ఇండియా లెవెల్‌లో శివగామి పాత్రలో నటించి భారీ క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ రెండు సినిమాలతో రమ్యకృష్ణ క్రేజ్ ఎవరు ఊహించని విధంగా పెరిగిపోయింది. .


ఇక త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన జైలర్ సినిమాలో కీరోల్‌ పోషించిన ఈమె.. ఈ సినిమా కోసం భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం. రమ్యకృష్ణ ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ భాషలో 110 కి పైగా సినిమాలలో నటించారు. ఈ హీరోయిన్ ఆస్తి దాదాపు రూ. 200 కోట్లకు పైనే ఉంటుందట. అలాగే ఆమె భర్త కృష్ణవంశీ కూడా డైరెక్టర్ గా సినిమాలు చేసి కొంతవరకు సంపాదించారు. అయితే రమ్యకృష్ణ ఆస్తితో పోలిస్తే కృష్ణవంశీ సంపాదించింది చాలా తక్కువ. ఇక ఇప్పుడు రోజుకు రమ్యకృష్ణ పది లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: