ఎట్టకేలకు ఈనెల 17వ తేదీన ఎమర్జెన్సీ చిత్రాన్ని థియేటర్లో రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ తాజాగా కంగనా రనౌత్ కు భారీ షాక్ తగిలినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ సినిమాని బ్యాన్ చేయాలంటూ తెలియజేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు గల కారణం బంగ్లాదేశ్, ఇండియా మధ్య జరుగుతున్న గొడవలు కారణంగా ఈ సినిమాని ఆపివేయాలని అక్కడ ప్రభుత్వం నిషేధిస్తున్నట్లు నాకు వినిపిస్తోంది.
అలాగే స్టోరీ పరంగా కూడా కంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల ఎఫెక్ట్ వల్లే ఈ సినిమాని అక్కడ బ్యాన్ చేయబోతున్నట్లు సమాచారం. ఎమర్జెన్సీ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో హీరోయిన్ కంగనా రనౌత్ నటించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ , గ్లింప్స్ ఈ సినిమా పైన ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఇందులో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండడం గమనార్హం. ఎమర్జెన్సీ సినిమా వల్ల కంగనా రనౌత్ ఇప్పటికే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ముఖ్యంగా తన ఇంటిని సైతం తాకట్టు పెట్టి మరి ఈ సినిమాని నిర్మించినట్లు ఇటీవలే తెలియజేసింది. మరి విడుదల అయ్యి సక్సెస్ అవుతుందనుకుంటున్న సమయంలో ఇలా చిత్ర బృందానికి ఇలాంటి శాఖ తగులుతోంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.