ఆయనతో గ్రాఫిక్ సినిమా చేస్తానని శ్యామ్ గారు కమిట్ అయ్యారు .. చిరంజీవి గారితో గ్రాఫిక్ సినిమా ఎందుకు ఓ కమర్షియల్ సినిమా చేద్దామని చెప్పిన శ్యాం ప్రసాద్ ఒప్పుకోలేదట ..అయితే చిరంజీవి తాను ఎన్ని రోజులు అయిన డేట్ లు ఇస్తానని చెప్పడం తో అంజి సినిమా పట్టాలు ఎక్కింది .. ఇంటర్వెల్ సీన్ ఏకంగా నెల రోజులు తీశారట .. చిరంజీవి కూడా చాలా ఓపికగా చేశారు .. ఆ సినిమాలో చిరంజీవిని ఒరేయ్ అని పిలిచే పాత్ర ఒకటి ఉంది .. చిరంజీవిని అలా పిలిచేందుకు ఎవరు సరిపోతారని భావించి చివరికి నాగబాబు తో పెద్దయ్య పాత్ర వేయించినట్టు కొడి రమకృష్ణ చెప్పారు ..
ఇక కొన్ని సన్నివేశాలకు 100 నుంచి 120 షాట్లు తీయాల్సి వచ్చేది .. అలా తీయబట్టే ఆ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి ఐదేళ్లు పట్టింది శ్యామ్ గారు చాలా ఖర్చుపెట్టి సినిమా తీశారు .. ఆ సినిమాకు పని చేస్తుంటే తల తిరిగిపోయేది గ్రాఫిక్స్ వర్క్ కోసం సింగపూర్ , మలేషియా , అమెరికాలో జరిగేది అని కోడి రామకృష్ణ చెప్పారు .. చిరంజీవి హీరోయిన్ నమ్రత మిగిలిన వాళ్ళందరూ కొత్త వాళ్లే అని ప్రారంభంలో ఆత్మ లింగం కోసం ప్రయత్నించే ఒక మాంత్రికుడు ఉంటాడు అతడు ఎల్వి ప్రసాద్ ఐ ఆస్పత్రి దగ్గర బిచ్చగాడు అతడితో ఆ పాత్ర వేయించినట్టు కోడి రామకృష్ణ చెప్పారు ..