పెద్ద హీరోలా సినిమాల షూటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి . మూగమనసులు షూటింగ్ గోదావరి మీద జరుగుతున్న రోజులు అవి ఈనాటి ఈ బంధం ఏనాటిదో అనే పాటను లంచి పై ఏఎన్నార్ సావిత్రిల మీద దర్శకుడు ఆధుని సుబ్బారావు చిత్రీకరిస్తున్నారు .. ఓ చరణంలో సావిత్రి ఓ పక్కకు బాగా వంగి అభినయం చేస్తున్నారు .. అయితే లంచ్ తాలూకు పల్ల కు సావిత్రి చీర కొంగు చిక్కింది .. లోపల పళ్ళచక్రం సావిత్రిని బలంగా గుంజింది .. వెంటనే సావిత్రి గోదావరి లో పడిపోయారు ..
అయినా సమయస్ఫూర్తి తో ఆమె మునిగిపోకుండా లంచ్ అంచున పట్టుకుని వేలాడుతూ ఉన్నారు .. లాంచ్ ఆగిపోయింది వెంటనే అందరిలోనూ ఒక్కసారి గా కంగారు మరో పడవలో ఉన్న యూనిట్ సభ్యులు సావిత్రి కి అందించేందుకు లంచ్ లోకి దూకారు .. ఆమెకు తాడు అందించారు సావిత్రి తాడు అందుకున్నారు కానీ పైకి రావడం లేదు .. అయినా సావిత్రి నీటిలో నుంచి పైకి రావడం లేదు పరిస్థితి ఏఎన్ఆర్ గ్రహించారు .. లాంచ్ లో ఓ ములన ఉన్న కాన్వాస్ పట్టాను సావిత్రికి అందించారు .. కాసేపటికి ఆ పట్ట చుట్టుకుని సావిత్రి బయటికి వచ్చారు ..
ఆవిడ చీరా మొత్తం లంచ్ కి చుట్టుకుపోయింది .. అప్పుడు నీటిలో నుంచి బయటికి రావటానికి సావిత్రి ఎందుకు తట పటాయించారు ఏఎన్ఆర్ తెలివిగా కాన్వాస్ పట్టా ఎందుకు అందించారో సిబ్బందికి అర్థమయిందట .. జనవరి 31 1964 లో విడుదలైన ఈ సినిమా ఇటీవల 60 ఏళ్ళు పూర్తి చేసుకుంది .. 19 కేంద్రాలలో వంద రోజులు 9 కేంద్రాలలో 175 రోజులు ఆడి మూగ మనసులు నాటి తెలుగు ప్రేక్షకులను ఎంతగా నో రంజింపజేసింది ..