దర్శక నిర్మతలు కొన్ని సందర్భాలలో ఒక హీరోని దృష్టిలో ఉంచుకుని కథలు రాస్తూ ఉంటారు .. అనూహ్యంగా ఆ హీరో నో చెప్పడం తో అదే కథను వేరే హీరోతో తెరకెక్కిస్తే సూపర్ డూపర్ హిట్ అవ్వడం లేదా పోవటం జరుగుతూ ఉంటుంది .. కొందరికి హీరోలు వదులుకున్న కొన్ని కథలు మరో హీరో చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి .. దర్శకుడు కాశీ విశ్వనాథ్ రాసిన ప్రేమ కథకు మహేష్ బాబు బాగుంటారని ప్రముఖ నిర్మాత సురేష్ దగ్గుబాటి సూచించారు .. అయితే మహేష్ బాబు ఆ కథకు నో చెప్పారు ..
వెంటనే అదే కథను యంగ్ హీరో తరుణ్ తో చేసి సూపర్ హిట్ కొట్టారు .. ఆ సినిమా మరేదో కాదు నువ్వు లేక నేను లేను .. మహేష్ తో సినిమా చేసేందుకు చాలా మంది దర్శకులు క్యూలో ఉంటారు .. మహేష్ డేటు దొరకటం కూడా కష్టం తరుణ్ , ఆర్తి అగర్వాల్ జంటగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లు తెరకెక్కిన నువ్వు లేక నేను లేను సినిమా 2002 సంక్రాంతి కనుకగా ప్రేక్షకుల మందికి వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది .. మహేష్ బాబు టక్కరి దొంగ , బాలకృష్ణ సీమ సింహం సినిమాలకు పోటీగా వచ్చి ఆ రెండు సినిమాలను మించి మరి ఈ సినిమా సూపర్ హిట్ అవడం విశేషం ..
నచ్చావులే , రైడ్ , నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా లాంటి సినిమాలలో తండ్రి పాత్రలు పోషించి మెప్పించిన కాశి విశ్వనాథ్ కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్ , కో డైరెక్టర్గా పలు సినిమాలుకు పని చేశారు .. నువ్వు లేక నేను లేను సినిమాతో దర్శకుడుగా బాధ్యతలు చేపట్టి సూపర్ హిట్ కొట్టారు .. ఆయన తెరకెక్కించిన రెండవ సినిమా తొలిచూపులోనే అందులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు .. ఆ తర్వాత ఆయన దర్శకత్వ బాధ్యతలు నుంచి తప్పుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు ..