ఇక సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సూపర్ హిట్ అయ్యాక .. ఇటీవల కాలంలో పలువురు అగ్ర హీరోలు యువ స్టార్లతో కలిసి వెండి తెరపై సందడి చేస్తున్నారు.... అయితే చిరు , వెంకీ , నాగ్ , బాలయ్య కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా ఒక్కసారి అయినా చూడాలన్న టాలీవుడ్ అభిమానులు కోరిక ఎప్పటికీ కలగానే ఉండిపోయింది .. వాస్తవానికి చిరంజీవి , వెంకటేష్ , నాగార్జున కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలన్న ఆలోచన 1990 లో అగ్ర దర్శక నిర్మాతలకు వచ్చింది .. బాలీవుడ్ లో వచ్చిన త్రిదేవ్ - (1989) ఆ క్రేజీ మల్టీస్టారర్ ఈ ఆలోచనలకు సహకారం కల్పించింది ఈ యాక్షన్ సినిమా అప్పట్లో బాలీవుడ్లో సంచలన విజయం సాధించింది ..
ఈ సినిమాను చిరంజీవి , నాగార్జున , వెంకటేష్ తో తెలుగులో తీస్తే బాగుంటుందని ఓ అగ్ర నిర్మమాణ సంస్థ 1990 లో గట్టి ప్రయత్నాలు చేసింది .. ఈ కథ ముగ్గురు హీరోల ఇమేజెకు సరిపడే స్థాయిలో ఉండటం మూడు పాత్రలకు సమప్రదాణం ఉండడంతో తెలుగులోను మంచి విజయం అందుకోవచ్చు అని భావించారట .. ఈ ముగ్గురు హీరోలతో చర్చలు కూడా జరిపారని వార్తలు వచ్చాయి .. మరి హీరోలు ఒప్పుకోలేదా ఈ ముగ్గురిని డైరెక్ట్ చేసేందుకు సరైన దర్శకుడు దొరకలేదు తెలియదు కానీ ఈ క్రేజీ మల్టీస్టారర్ కార్యరూక్ చేశారు అయితే ఇది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది ..