చిత్రం సినిమాతో సంగీత దర్శకుడుగా పరిచయమయ్యాడు ఆర్పి పట్నాయక్. ఈ సినిమా మ్యూజికల్‌గా మంచి పేరు తెచ్చింది. ముఖ్యంగా టైటిల్ సాంగ్.. ఎప్పటికీ మ్యూజిక్ లవర్స్ మొబైల్స్‌లో మోగుతూనే ఉంటుంది. ఈ సినిమాతోనే దర్శకుడుగా పరిచయమైన తేజా .. ఆ సినిమాకి ఆర్పీ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు ఈ సినిమాను నిర్మించారు. మొదటి సినిమా నుంచి కూడా దర్శకుడు తేజ ఆర్పి పట్నాయక్, గుణశేఖర్, రసూల్ ఒక టీం గా సెట్ అయ్యారు.
ఏ సినిమా చేసిన ఇదే టీం కలిసి ఫైనల్ చేసుకునేవారు. అలా తేజ, ఆర్పి పట్నాయక్ వరుసగా సినిమాలు చేస్తూ ఉండడంతో వారి మధ్య మంచి బాండింగ్ వచ్చింది. కొంతకాలం తర్వాత ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. దీనికి కారణం తేజకి . .. ఆర్పీ మీద కోపం రావటమే అన్న గుసగుసలు వినిపించాయి. ఆర్.పి.పట్నాయక్ లో మంచి నటుడుగా కూడా ఉన్నారు. ఆయన శ్రీను వాసంతి, లక్ష్మి అనే సినిమాతో నటుడుగా మారారు. .
కానీ.. అది తేజకి ఇష్టం లేదు. ఆర్పి మంచి సంగీత దర్శకుడు.. దాన్ని వదిలేసి నటుడుగా మారటం నాకు ఇష్టం లేదని .. ఇదే విషయాన్ని ఆర్పి పట్నాయక్ కు చెప్తే వినలేదని . . . అందుకే దూరం పెట్టినట్లు చెప్పారు. తేజ చెప్పినట్టుగానే ఆర్పి కొంతకాలానికి అటు నటుడుగా సక్సెస్ కాలేకపోయారు.. ఇటు సంగీత దర్శకుడుగా సినిమాలు లేవు. మళ్ళీ చాలా రోజుల తర్వాత దగ్గుబాటి వారసుడు అహింస సినిమా తో తేజ , ఆర్పి పట్నాయక్ ఇద్దరు కలిసేశారు. ఈ సినిమా కూడా అంచనాలు అందుకోలేదు. .