టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఆ ఫ్యామిలీలో మూడోతరం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగచైతన్య. నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంత.. ప్రేమ, విడాకుల గురించి అందరికీ తెలిసిందే. ఏ మాయ చేసావే సినిమాతో ప్రేమలో పడిన ఈ జంట.. ఆ తర్వాత వరుసగా నాలుగైదు సినిమాలలో కలిసి నటించారు. దాదాపు ఆరు ఏడు సంవత్సరాల పాటు గుట్టుచప్పుడు కాకుండా ప్రేమించుకున్న వీరిద్దరూ.. 2013లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి నాలుగేళ్లు కూడా కాపురం చేయకుండానే మనస్పర్ధలు నేపథ్యంలో విడాకులు తీసుకున్నారు.


అనంతరం నాగచైతన్య మరో హీరోయిన్ శోభితతో ప్రేమలో పడి ఆమెను ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన మాజీ భర్త చైతన్య మళ్లీ పెళ్లి చేసుకున్నా.. సమంత ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. నాగచైతన్య‌ను పెళ్లి చేసుకున్న తర్వాత సమంత చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఒప్పుకున్నారు. ఓ బేబీ, మజిలీ సినిమాలు వచ్చాయి. వీటిలో మజిలీ మంచి హిట్ అయింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత నాగచైతన్య, సమంత ఎలాంటి కథలు కోసమే దర్శక, రచయితలకు చెప్పారు. మజిలీ లాంటి కథ తీసుకువస్తే అది నచ్చితే తాము ఇద్దరం కలిసి ఆరు ఏడు కోట్ల రెమ్యూనరేషన్‌తో సినిమాకు కమిట్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నారు.


అయితే తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి కలిసి నటించిన సూపర్ హిట్ సినిమా 96 ని దిల్ రాజు ఇక్కడ తిరిగి రీమేక్ చేశారు. ఈ సినిమా ఫేడౌట్ అయిపోయిందనుకున్న త్రిష‌కు మంచి కం బ్యాక్ గా నిలిచింది. దీంతో తెలుగు కోసం రీమేక్ రైట్స్ కొన్న దిల్ రాజు.. నాగచైతన్య, సమంతతో తీయాలని అనుకున్నా.. చైతన్యకు కథ నచ్చలేదు. కానీ సమంత.. జాను సినిమా చేయడానికి ఓకే చెప్పింది. నాగచైతన్య ఎంత చెప్పినా ఒప్పుకోలేదట. చివరకు చైతు స్థానంలో శర్వానంద్ వచ్చి చేరాడు.


తన మాట కాదని సమంతసినిమా చేయటం నాగచైతన్యకు ఎంత మాత్రం నచ్చలేదట. సినిమా మొత్తం అవుట్ పుట్ చూశాక సమంత హీరోయిన్గా ఉన్నా కూడా.. దిల్ రాజుకు రిజల్ట్ ముందే అర్థం అయిపోయింది. అందుకే ప్రమోషన్ చేయకుండా గాలికి వదిలేసారు. తర్వాత నాగచైతన్య జడ్జిమెంట్ నిజం అయింది. సినిమా డిజాస్టర్ అయింది. అక్కడ నుంచి వీరిమధ్య మనస్పర్ధలు క్రమంగా పెరిగి పెద్దవి అయ్యాయని ఇండస్ట్రీలో గుసగుసలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: