విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్లుగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించారు. ఈ సినిమా సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా నిన్న ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైంది. విడుదలైన మొదటి రోజే 45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ తన కెరీర్ లో బెస్ట్ అండ్ హైయెస్ట్ ఓపెనింగ్ అందుకున్నారు.


45 కోట్ల గ్రాస్ అంటే మామూలు విషయం కాదు. సంక్రాంతి పండుగకి థియేటర్లోకి వచ్చిన సంక్రాంతి వస్తున్నాం సినిమా కంటే ముందు వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఎఫ్2, ఎఫ్3 సినిమాలు రిలీజ్ అయి మంచి కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి. ఆ రెండు సినిమాలు భారీ విజయాలను అందుకోగా....ఎఫ్3 సినిమా బాక్సాఫీస్ బరిలో మొత్తంగా రూ. 130 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆ గ్రాస్ కలెక్షన్లను క్రాస్ చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కాగా ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. కాగా ఈ సినిమాలో వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఐశ్వర్య రాజేష్ వెంకీకి భార్య పాత్రలో అద్భుతంగా నటించింది. మీనాక్షి చౌదరి లవర్ క్యారెక్టర్ లో చాలా అద్భుతంగా నటించింది. ఈ క్రమంలో చిత్ర బృందం నిన్న సక్సెస్ మీట్ ను నిర్వహించారు.

దీనికి వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, దిల్ రాజు, అనిల్ రావిపూడి వంటి ప్రముఖులు విచ్చేశారు.  కాగా ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే ఓటిటి లోకి రాబోతోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటిటి హక్కులను జీ5 సంస్థ దక్కించుకుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: