ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించగా ఈ మూవీ సీక్వెల్ పై ఊహించని స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాదే కల్కి సీక్వెల్ షూట్ మొదలయ్యే ఛాన్స్ ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాత అశ్వనీదత్ కల్కి సీక్వెల్ గురించి తాజాగా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.
 
కల్కి సీక్వెల్ వచ్చే ఏడాది విడుదలవుతుందని సెకండ్ పార్ట్ మొత్తం కమల్ హాసన్ ఉంటారని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు. అయితే కల్కి సీక్వెల్ షూట్ వచ్చే ఏడాది మొదలవుతుందని ఆయన అన్నారు. కల్కి సీక్వెల్ మొత్తం ప్రభాస్, కమల్ మధ్య సీన్స్ ఉంటాయని అశ్వనీదత్ పేర్కొన్నారు. అమితాబ్ పాత్రకు సైతం ప్రాధాన్యత ఉంటుందని ఆయన అన్నారు. సినిమాలో ఈ మూడు పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయని అశ్వనీదత్ వెల్లడించారు.
 
ఈ పాత్రలతో పాటు దీపిక పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని అశ్వనీదత్ అన్నారు. కల్కి సీక్వెల్లో కొత్త నటీనటులు ఉంటారని నేను అనుకోవడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ కథకు అవసరం అయితే ఈ సినిమాలో కొత్తవాళ్లు కనిపించే అవకాశం ఉందని అశ్వనీదత్ పేర్కొన్నారు. నాగ్ అశ్విన్ మహానటి తీసే సమయంలో ఎక్కడా భయం లేకుండా షూట్ పూర్తి చేశారని ఆయన చెప్పుకొచ్చారు.
 
నాగ్ అశ్విన్ కు లైఫ్ లో ఓటమి అనేది ఉండదని నేను ఫీలవుతానని అశ్వనీదత్ వెల్లడించారు. కల్కి సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో కల్కి సీక్వెల్ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. కల్కి సీక్వెల్ లో ప్రభాస్ కర్ణుడి పాత్రలో కనిపించనున్నారు. కల్కి సీక్వెల్ ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా 3000 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించే సినిమా అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కల్కి సీక్వెల్ పై ప్రేక్షకుల్లో అంచనాలు మాత్రం ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి.


 


మరింత సమాచారం తెలుసుకోండి: