తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ నటుడుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న కెప్టెన్ విజయ్‌కాంత్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక పేరుకు తగ్గట్టుగానే ఆయన వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది. నటనతో పాటు నిర్మాతగాను తన సత్తా చాటుకున్న ఆయన.. నటినటుల‌ సంఘ అధ్యక్షుడిగా, రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. అంతేకాదు.. మంచి మానవతావాదిగా కూడా పేరు సంపాదించుకున్నారు. ఇక విజయ్‌కాంత్ ఎంతమంది పేదలకు ఆకలి తీర్చడంలో తన వంతు సహాయం అందించాడు. అలాంటి విజయ్‌కాంత్ మీనాను ఓ ఆకతాయి హెల్మెట్ పెట్టుకుని వచ్చి టీజ్ చేస్తూ.. అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె రక్షణ కోసం ఏం చేశారో నిర్మాత శివ ఓ ఇంటర్వ్యూలో ంట్ర‌స్టింగ్‌గా వెల్లడించాడు. ఇక‌ విజయకాంత్ షూటింగ్ సెట్స్‌లో అందరికీ సమానమైన భోజనం సాంప్రదాయాన్ని కూడా ప్రవేశపెట్టాడు.
 

ప్రతిరోజు తాను తినే ఆహారమే ఇతరులు కూడా తినాలని భావించిన మంచి వ్యక్తి. మాంసాహారం తినే వారందరికీ అదే భోజనాన్ని వడ్డించారు. ఇలా ఆయన మంచితనానికి ఆయన ఆతిథ్యానికి ఇష్టపడి ఎంతోమంది ఇతర షూటింగ్లకు వెళ్లకుండా.. త‌న సినిమాలు చేయడానికి ఇష్టపడే వారట. ఇక ఆయన గొప్ప ఆలోచనలు, గొప్ప పనులు ఇప్పటికి ఆయనను ఎంతో మంది మదిలో దేవుడిలా ముద్ర వేశాయి. గత సంవత్సరం డిసెంబర్ 28న విజయ్ కాంత్ అనారోగ్య కారణంతో మరణించగా గోవిందపురంలోని ఆయన పార్టీ కార్యాలయం ముందు.. విజయ్‌కాంత్ పార్థివదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. ఇక అక్కడే ఒక స్మారక నిలయాన్ని నిర్మించి అభిమానులు దానిని దేవాలయంలో పూజలు చేసుకుంటారు. ఎంతోమంది అభిమానులు ఇప్పటికీ ప్రతిరోజు పూజలు చేస్తారు. అదేవిధంగా అక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం ఓ పూట పేదవారికి అన్నదానం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే విజయ్ కాంత్ గురించి ప్రముఖ నిర్మాత టి. శివ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

 

నటుడు విజ‌య్‌కాంత్ నక్షత్ర కళా మహోత్సవా బాధ్యతలన్నీ తానే దగ్గర ఉండి చూసుకుని ఆ పనిని ముగించార‌ని.. ఈ క్రమంలోనే మీనాను ఆప‌ద‌ నుంచి కాపాడాడంటూ వెల్లడించాడు. మలేషియా నుంచి సింగపూర్ కి వెళ్తున్నప్పుడు వారు బస చేసిన హోటల్ ముందు సెలబ్రిటీలను చూడడానికి వేలమంది జనం గుమ్మ గుడారని.. సరైన పోలీసు భద్రత లేకపోవడంతో అక్కడ తొక్కిసలాట జరిగిందంటూ వివరించాడు. ఆ సమయంలో విజయకాంత్ నెపోలియన్ శరత్ కుమార్ లగేజీలను బస్సులో ఎక్కిస్తున్నాడ‌ని.. హెల్మెట్ ధరించి అక్కడికి వచ్చిన ఓ ఆకతాయి వ్యక్తి నటి మీనా దగ్గరికి వచ్చి ఆమెతో తప్పుగా ప్రవర్తించాడని.. ఈ విషయాన్ని విజయకాంత్ గమనించి వేగంగా అతని దగ్గరకు వెళ్లి హెల్మెట్ తీసి తలకు పెట్టి కొట్టారని.. ఆ వ్యక్తి తల పగిలి రక్తం కారిందని వివరించాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసులాట జరిగింద‌ని.. చాలామంది భయపడి వెనక్కి తగ్గార‌ని.. తర్వాత నటి మణుల‌ను సురక్షితంగా బస్సులో తీసుకువెళ్లారని.. అప్పట్లో ఇది హాట్‌ టాపిక్ గా మారింది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: