తెలుగు సినిమాలకు ఎన్నో దశాబ్దాలు అనితర సేవలు అందించి.. 100కు పైగా సినిమాలుకు దర్శకత్వం వహించి లెజెండ్రీ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న దాసరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన గొప్ప నటుడు కూడా ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఇక రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేంద్ర మాంత్రిక బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక నాలుగు తరాల హీరోలతో కలిసి పనిచేసిన దాసరి.. ఇండస్ట్రీ పెద్దగా ఓ వెలుగు వెలిగారు. ఇక చిన్న సినిమాలకు, నిర్మాతలకు ఎలాంటి సమస్య ఎదురైనా ఆయన ముందు నిలబడే వారు. చిన్న సినిమాను బ్రతికించుకున్నప్పుడే ఇండస్ట్రీ  కూడా సాధ్యమని ఆయన నమ్మేవారు.
 

లోబడ్జెట్ సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలను ప్రోత్సహించాలని ఆ సినిమాల రిలీజ్ కు ఎలాంటి అడ్డంకులు లేకుండా వెసులుబాట్లు కల్పించాలని ఎప్పుడూ ఆయన పోరాడుతూ ఉండేవారు. ఈ మేరకు ఆయన కొన్ని ప్రతిపాదనలు తెరపైకి తీసుకువచ్చారు. కేవలం టాలీవుడ్ నాలుగు కుటుంబాల గుప్పెట్లో నలిగిపోతుందని.. వారి ఆధిపత్యం వల్లే చిన్న సినిమాలు నటులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, నష్టపోతున్నారు.. నలిగిపోతున్నారంటూ దాసరి బహిరంగంగానే ఎన్నోమార్లు ఓపెన్ కామెంట్స్ చేశాడు. దాసరి విమర్శలు గుప్పించిన ఆ నాలుగు కుటుంబాల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకటనే వాదన ఎప్పటి నుంచో ఉంది.

 

ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం కారణంగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి కష్టపడుతున్న నటీనటులకు అన్యాయం జరుగుతుందని.. దాసరి ఆరోపణలు చేశాడు. ఇక దాసరి కామెంట్స్‌తో చిరంజీవి బాగా హర్ట్ అయ్యారని.. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్యన మనస్పర్ధలు తలెత్తయని మెల్లమెల్లగా దూరం పెరిగింది అంటూ అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఓ సందర్భంలో దీనిపై దాసరి స్పందించారు. చిరంజీవికి, తనకు అసలు ఎలాంటి విభేదాలు లేవని.. నాకు అతనితో ఎందుకు గొడవలు ఉంటాయి.. అసలు నాకు చిరంజీవి బంధు అవుతాడంటూ వెల్లడించాడు. చాలామందికి ఈ విషయం తెలియదు. మా మేనల్లుడు చిరంజీవి బంధువును పెళ్లాడాడని దాసరి వివరించాడు. దాసరి సొంత మేనల్లుడు.. చిరంజీవి పిన్నమ్మ అమ్మాయిని వివాహం చేసుకున్నాడట. ఆ విధంగా చిరు, దాసరి మధ్యన బంధుత్వం ఉందని ఆయన చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: