మెగా హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో జనవరి 10వ తేదీన రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలుసు. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే  నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రంపై రకరకాలుగా స్పందిస్తున్నారు. అలాంటి ఈ తరుణంలో తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ పై దర్శకుడు శంకర్ నోరు విప్పారు. దీంతో శంకర్ ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. మరి దర్శకుడు ఏమన్నారు..ఆ వివరాలు ఏంటో చూద్దాం.. అయితే తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే.. మీరు గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి యూట్యూబ్ ఆన్లైన్ రివ్యూ చూసారా అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన శంకర్ నేను అలాంటి రివ్యూలు ఏమి చూడలేదు. కానీ అన్నిచోట్ల పాజిటివ్ రెస్పాన్సే వస్తుందని నేను విన్నాను అని సమాధానం ఇచ్చారు.. అంతేకాకుండా ఈ చిత్రం ఫైనల్ అవుట్ పుట్ ద్వారా నేను సంతృప్తి చెందలేదని, ఇంకా బాగా  చేయాలనుకున్నాను.

 అసలు ఈ మూవీకి మొత్తంగా ఐదు గంటల ఫుటేజ్ వచ్చిందని, కానీ రన్ టైం తగ్గించడం కోసం ట్రిమ్ చేయాల్సి వస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంలోనే కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ అన్ని తీసేయాల్సి వచ్చిందని శంకర్ అన్నారు. అంత ఎక్కువ నిడివి ఉంటే మా తెలుగు సినిమాలు చూడరు సార్ అంటూ దిల్ రాజు చెప్పారు. అందుకే ఆ సినిమాని చాలావరకు ట్రిమ్ చేశాము.ఇక ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో 20 నిమిషాల ఎపిసోడ్ పూర్తిగా తీసేసాం.కానీ ఆ సీన్ లో రామ్ చరణ్ నటన చాలా బాగుంది. ఆ సీన్ ఉండుంటే గనక రామ్ చరణ్ నటనకి నేషనల్ అవార్డు కూడా వచ్చేది.అంతా అద్భుతంగా నటించాడు రామ్ చరణ్ అంటూ శంకర్ చెప్పుకొచ్చారు.

అంతేకాదు దిల్ రాజు సినిమా నిడివి తగ్గించమని చెప్పడం వల్లే ఈ సినిమా డిజాస్టర్ అయింది అన్నట్లుగా శంకర్ మాట్లాడడంతో చాలామంది శంకర్ పై విరుచుకు పడుతున్నారు. దిల్ రాజు డబ్బులన్ని మంచినీళ్ళలా ఖర్చుపెట్టావు అని ఆయన పై ఫైర్ అవుతున్నారుఈ విధంగా ఆయన సమాధానం ఇవ్వడంతో ఆయనను నెటిజన్స్ విపరీతంగా తిడుతున్నారు. అసలు ఆ సినిమాలో ఏముందని మీరు ఐదు గంటలు అంటున్నారు అంటూ ఏకిపారేస్తున్నారు. ఇంత భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించే ముందు డైరెక్టర్ కాస్తయినా చూసుకోవాలి కదా అంటూ అభిమానులు విరుచుకు పడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్ల విషయానికి వస్తే..  ఇండియా మొత్తం కలిపి మంగళవారం వరకు 106.15 కోట్లు వసూలు చేసిందని అంచనా వేస్తున్నారు. ఇక దీని బట్టి చూస్తే మాత్రం ఈ సినిమా దారుణంగా డిజాస్టర్ అయిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: