టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా "గేమ్ చేంజర్" .  ఈ మూవీ కోసం రామ్ చరణ్  చాలా కష్టపడ్డారు . స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుంది అని తెలియడంతో జనాలు ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు.  ఒక అపరిచితుడు.. ఒక ఒకే ఒక్కడు సినిమా టైపులో ఈ సినిమా ఉంటుంది అని ఊహించుకున్నారు . సిన్ కట్ చేస్తే సినిమాకి అంత సీన్ లేదు అంటూ అర్థం అయిపోయింది . సంక్రాంతి రేసులో భారీగా వెనక పడిపోయింది  "గేమ్ చేంజర్".


సినిమా నెగటివ్ టాక్ అందుకుంది. అంతేకాదు  ఈ సినిమాకి సంబంధించిన ఒక్కొక్క వార్త సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా రీసెంట్ గా గేమ్ చేంజింగ్ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అన్న విషయం అందరికి తెలుసు. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ..అలాగే తెలుగు హీరోయిన్ అంజలి. అయితే ఈ సినిమాలో అంజలి క్యారెక్టర్ కి మంచి మార్కులు పడ్డాయి.



సినిమా షూటింగ్ టైంలో ఓ సీన్ చేయడానికి రామ్ చరణ్ చాలా చాలా ఇబ్బంది పడ్డారట .  ఎన్నో సినిమాల్లో రొమాంటిక్ సీన్లు చేసిన చరణ్..ఈ సినిమాలో ఓ సీన్ చేయడానికి మాత్రం చాలా చాలా సిగ్గుపడ్డారట. అంజలిని ఎత్తుకునే సీన్ ఒకటి ఉంటుంది ఐనిమాలో..ఆ సీన్ చేయడానికి ఇబ్బంది పడ్డారట చరణ్.  అంజలితో రాంచరణ్ కి పెద్ద కనెక్షన్ లేదు . బయట మాట్లాడిన సందర్భాలు కూడా లేవు.  షూటింగ్ స్టార్ట్ అయిన వీళ్ళ కాంబోలో మొదటి సీన్ కి అలాంటి ఒక షాట్ చేయమనడంతో రామ్ చరణ్ చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాడట. సిగ్గు పడిపోతూ.. ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడైనా ఈ సీన్ చేస్తాము అంటూ చరణ్ వెనకడుగు వేశారట. అంజలి మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఈ సీన్  చేయడానికి ఓకే చేసిందట.  కానీ రామ్ చరణ్ మాత్రం సిగ్గుపడిపోతూ ఉండడంతో శంకర్ అర్థం చేసుకుని తర్వాతనే ఆ సిన్న్ షూట్ చేద్దాం అని చరణ్ కి రెస్పెక్ట్ ఇచ్చారట.  కొన్ని డేస్ అంజలి - చరణ్ ఫ్రెండ్ షిప్ చేసుకున్నాకే అలా  ఎత్తుకునే సీను చిత్రీకరించారట . దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు తెలుగు ఫిలిం సర్కిల్స్ బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: