90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ భారీ విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ముఖ్యంగా 90స్ కిడ్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా టైటిల్ కి పెట్టిన ట్యాగ్ లైన్ కు తగ్గట్టుగానే ఇది మిడిల్ క్లాస్ బయోపిక్ అని చెప్పవచ్చు. కంటెంట్ బాగుందని తెలిస్తే ఆడియన్స్ ఎగబడి చూస్తారు అనడానికి ఈ వెబ్ సిరీస్ ఒక ఉదాహరణ. ప్రముఖ ఓటీటీ వేదికగా ఈటీవీ విన్ యాప్ లో రిలీజ్ అయిన ఈ సిరీస్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. భారతదేశంలో అత్యధికంగా ప్రేక్షకులు వీక్షించిన తెలుగు సీరీస్ గా రికార్డ్ సృష్టించింది.

ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ని నవీన్ మేడారం నిర్మించారు. ఇక ఈ సిరీస్ లో శివాజీ, వాసుకి ఆనంద్, రోహన్, వాసంతిక, మౌళి ప్రధాన పాత్రలు పోషించారు. ఇకపోతే ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కి సీక్వెల్ సిద్ధం అయిపోయింది. అయితే ఇక్కడ హీరో అందరిని ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు. ఒక చిన్న పిల్లవాడు(Mouli ) ఆదిత్య పాత్ర ఎంతలా ప్రేక్షకుల మనసును గెలుచుకున్న విషయం అందరికీ తెలిసిందే.  ఆ పిల్లవాడు 10 సంవత్సరాల తర్వాత పెద్దవాడైతే,  ఆ పాత్రను ఆనంద్ దేవరకొండ పోషిస్తే,  అతనికి ఒక అందమైన ప్రేమ కథ ఉంటే? ఎలా ఉంటుంది?  అనే ఆలోచన నుంచి ఈ చిత్ర కథ పుట్టినట్లుగా అనౌన్స్మెంట్ వీడియోలో చూపించడం జరిగింది.

ఇక వీడియోలో మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూసారు కదా.. ఇప్పుడు థియేటర్లలో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి. ఇది నా స్టోరీ నీ స్టోరీ.. కాదు మన అందరి స్టోరీ.. మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ అంటూ వీడియో చివర్లో ఆనంద్ చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ వెబ్ సిరీస్ ని శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్ పథకాలపై సూర్యదేవరనాగ వంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఆనంద్ దేవరకొండకు జోడిగా మళ్లీ వైష్ణవి చైతన్య నటించిన బోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: