నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ మధ్య కాలంలో బాలయ్య వరుస పెట్టి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటు ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య తాజాగా బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ అనే పక్క మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయింది.

మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు నుండి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. తాజాగా ఈ మూవీ యూనిట్ వారు ఈ సినిమాకు మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లకు తెలియజేస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఈ మూవీ బృందం వారు తాజాగా విడుదల చేసిన పోస్టర్ ప్రకారం ఈ సినిమాకు మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 102 ప్లస్ కోట్ల గ్రాస్ కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా వచ్చినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో లాంగ్ రన్ లో ఈ మూవీ భారీ కలెక్షన్ లను వసూలు చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. బాలీవుడ్ నటుడు బాబి డియోల్ ఈ సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: