చాలా మంది నటీమణులు తెలుగులో కెరియర్ను మొదలు పెట్టిన కూడా తెలుగు సినిమాల కంటే కూడా తమిళ్ మూవీల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్థాయికి ఎదిగిన వారు కొంత మంది ఉన్నారు. ఇకపోతే పైన ఫోటోలో రెండు జెళ్ళతో ఓ అమ్మాయి ఉంది కదా ..? ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె కెరియర్ ప్రారంభంలో కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు మంచి విజయాలను సాధించకపోవడంతో ఈమెకు ఆ మూవీ ల ద్వారా తెలుపు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు రాలేదు.

దాని తర్వాత ఈమె తమిళ సినిమాలలో నటించడం మొదలు పెట్టింది. ఈమె నటించిన తమిళ సినిమాలు మంచి విజయాలు సాధించడంతో తక్కువ కాలంలోనే ఈమెకు కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. దానితో ఈమె మళ్లీ తెలుగులో సినిమాలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్థాయికి చేరుకుంది. ఇకపోతే తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ నటించిన ఓ సినిమా విడుదల అయింది. మరి ఆమె ఎవరు అనుకుంటున్నారు ..? పైన ఫోటోలో రెండు జెళ్ళతో ఉన్న అమ్మాయి మరెవరో కాదు ... ఆమె మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి అంజలి. ఈ బ్యూటీ కెరియర్ ప్రారంభంలో కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తమిళ్లో జర్నీ అనే మూవీ లో నటించి మంచి విజయాన్ని అందుకుంది.

దానితో ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. ఇకపోతే తాజాగా రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ సినిమాలో ఈ బ్యూటీ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి ధియేటర్లలో ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: