నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ చిత్రం ఫుల్ క్రేజ్ మధ్య జనవరి 12వ తేదీన రిలీజైంది. సంక్రాంతి సందర్భంగా ఈ యాక్షన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. బాలయ్య యాక్షన్ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తోంది. ఈ సినిమా మూడు రోజుల్లో ఎంత కలెక్షన్లను దక్కించుకుందో మూవీ టీమ్ నేడు అనగా జనవరి 15 వెల్లడించింది.డాకు మహారాజ్ చిత్రం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.92 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ విషయాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ వెల్లడించింది. వసూళ్ల లెక్కతో పోస్టర్ తీసుకొచ్చింది. "కింగ్ ఆఫ్ సంక్రాంతి.. భారీగా ఫైర్ అవుతున్నాడు. హృదయాల్లాగే బాక్సాఫీస్‍ను ఏలుతూ డాకూ మహారాజ్ ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.92కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది. హైవోల్టేజ్ యాక్షన్, హృదయాలను హత్తుకునే ఎమోషన్‍తో సంక్రాంతికి సూటయ్యే ట్రీట్" అని పోస్ట్ చేసింది.ఇదిలావుండగా డాకు మహారాజ్ చిత్రం తొలి రోజు రూ.56కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకున్నట్టు మూవీ టీమ్ వెల్లడించింది. బాలయ్యకు ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్‍గా నిలిచింది. రెండో రోజు మరో రూ.18కోట్లను ఈ చిత్రం వసూలు చేసి.. రూ.74కోట్లకు చేరిందని వెల్లడించింది. సంక్రాంతి అయిన సంక్రాంతి రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.18కోట్లను ఈ చిత్రం సాధించింది. దీంతో మూడు రోజుల్లో రూ.92కోట్ల గ్రాస్ కలెక్షన్లకు చేరింది. పండుగ తర్వాత బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ చిత్రం ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.ఈ క్రమంలో ఇప్పటికే సక్సెస్ మీట్, సెలెబ్రేషన్ పార్టీని కూడా మూవీ టీమ్ చేసుకుంది. ఈ సినిమాకు ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నామని నాగవంశీ చెప్పారు. అనంతపురం లో భారీగా సక్సెస్ ఈవెంట్ నిర్వహిస్తామని కూడా వెల్లడించారు. తమిళం, హిందీలోనూ ఈ చిత్రం విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: