టాలీవుడ్ ఇండస్ట్రీ లో తమ డైరెక్షన్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటినుంచి ఇప్పటివరకు ఇంకా మాస్ సినిమాలకు కేర్ఆఫ్ అడ్రస్ గా నిలిచిన డైరెక్టర్ లలో బోయపాటి శ్రీను, బాబీ కొల్లి, గోపీచంద్ మలినేని ఈ ముగ్గురు వున్నారు.ఈ క్రమంలోనే డైరెక్టర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ తో ఆడియన్స్ ముందుకురావాలి. కొత్తగా కథల్నిప్రేక్షకులకు నచ్చేలా చెప్పగలగాలి. కానీ ఈ డైరెక్టర్లు మాత్రం కొత్తదనం అన్న కాన్సెప్ట్ ఉంటుందని మర్చిపోయినట్టున్నారు. కెరీర్‌ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి ఇన్నేళ్లైనా ఇంకా అవే మాస్ సినిమాలు,అదే రొటీన్ యాక్షన్ తో బోర్ కొట్టిస్తున్నారు.ఈ క్రమంలో మాస్ యాక్షన్ జోనర్స్ ను అసలు వదిలిపెట్టకుండా కెరీర్ లో వరసగా మాస్ సినిమాలే చేస్తున్నా డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఈయన 2010 లో చేసిన డాన్ శీను దగ్గరినుండి మొన్న వచ్చిన బాలయ్య సినిమా వీర సింహ రెడ్డి వరకు అన్నీ కూడా మ్యాగ్జిమమ్ మాస్ యాక్షన్ మూవీసే. రవితేజతో చేసిన క్రాక్ మూవీతో ఈ మాస్ యాక్షన్ అనేది నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లారు గోపీచంద్. ఆతర్వాత వచ్చిన వీరసింహ రెడ్డి కూడా ఫుల్ యాక్షన్ డ్రామానే.అలాగే ఈ బాటలోనే మాస్ కమర్షియల్ మూవీస్ లో ఎక్స్ ట్రీమ్ మాసిజంని ఆడియన్స్ కి చూపించిన మరో డైరెక్టర్ బోయపాటి. హీరో ఎవరైనా సరే .. అదే ఎలివేషన్ , అదే యాక్షన్ . సినిమా జానర్ తో సంబంధం లేదు, స్టోరీతో సంబంధం లేదు.

బోయపాటి చేసిన ఏ సినిమా అయినా.. బాబు యాక్షన్ అన్నాడంటే.. వరసపెట్టి గాల్లోకి సుమోలు ఎగరాల్సిందే . కత్తిపడితే తలలు తెగిపడాల్సిందే. మూవీలో అన్నీ ఎలిమెంట్స్ ఉన్నా ..ఊరమాస్ హైలైట్ కావాల్సిందే . హీరో మారినా, బడ్జెట్ మారినా, స్కేల్ మారినా బోయపాటి మాత్రం భద్ర నుండి మొన్నటి స్కంద మూవీ వరకు అన్నీ మాస్ కమర్షియల్ సినిమాలే. మరి బాలయ్య తో చేస్తున్న అఖండ 2 లో ఇంకెన్ని మాస్ ఎలిమెంట్స్ చూపిస్తారో, ఏరేంజ్ యాక్షన్ చేయిస్తారో అన్న చర్చ ఆల్రెడీ జరుగుతోంది.ఈ దారిలో పయనిస్తున్న మరో డైరెక్టర్ బాబీ కొల్లి బాలయ్య హీరోగా వచ్చిన డాకుమహారాజ్ ని తనస్టైల్లో మాస్ కమర్షియల్ మూవీగానే తెరకెక్కించారు. ఓ ఫ్లాష్ బ్యాక్ , హీరో అన్ రియల్ ఎలివేషన్స్ , భారీ యాక్షన్ సీన్స్ , సెంటిమెంట్ ఇలా తన పాతి సినిమాల్లాగే సేమ్ ఫార్మాట్ లో తెరకెక్కించారంటూ ఆడియన్స్ ఫీలవుతున్నారు. బాబీ ఇప్పుడే కాదు  అంతకుముందొచ్చిన వాల్తేర్ వీరయ్య, జై లవకుశ, వెంకీమామ, పవర్, ఇలా బాబీ చేసిన మ్యాగ్జిమమ్ సినిమాలన్నీ అటూ ఇటూగా అదే మాస్ యాక్షన్ తో తెరకెక్కినవే. ఇక లేటెస్ట్ గా వచ్చిన డాకుమహారాజ్ కూడా ఇలాగే ఉందంటున్నారు జనాలు.ఇలా మాస్ జపం చేస్తూ ఈ డైరెక్టర్లు మాత్రం అస్సలు మారేదే లే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: