అందాల తార రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సిల్వర్ స్క్రీన్ పైన అందంగా, పొగరుబోతు అమ్మాయిగా, భావోద్వేగ సన్నివేశాలలో ఎలా అయినా నటించాలంటే తనకు తానే సాటి. ఇప్పటికే రమ్యకృష్ణ తనకి వస్తున్న అన్ని పాత్రలో అద్భుతంగా నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. ఇప్పుడు కేవలం అమ్మ, అత్త వంటి పాత్రను మాత్రమే పోషిస్తుంది. 

దాదాపు 35 ఏళ్లకు పైగా తన కెరీర్ ని రమ్యకృష్ణ విజయవంతంగా కొనసాగిస్తోంది. రిపబ్లిక్, రొమాంటిక్ లలో నటించింది. టైగర్, బంగార్రాజు వంటి సినిమాలలో కూడా తన నటనతో ఆకట్టుకుంది. రమ్యకృష్ణ తన కెరీర్ లో ఇప్పటివరకు వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, రజనీకాంత్ వంటి ఎంతోమంది అగ్ర హీరోల సరసన నటించింది. అయితే రమ్యకృష్ణకు ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే మంచి గుర్తింపు రాలేదు.


దాదాపు 15 సినిమాలలో నటించిన అనంతరం ఆమెకి స్టార్ హీరోయిన్గా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత రమ్యకృష్ణ కెరియర్ ఎక్కడికో వెళ్ళింది. కాగా రమ్యకృష్ణ చాలా సంవత్సరాలుగా చెన్నైలోనే ఉంటున్న సంగతి తెలిసిందే. 50 సంవత్సరాల వయసులో రమ్యకృష్ణ ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా, ఫిట్ గా, అందంగా ఉండడం వెనక కారణం బయటపడింది.


ఈ వయసులో కాళ్లు, వీపు వంటి పెద్ద కండరాల సమూహాలపై దృష్టి సారించి కనీసం రెండు నుండి మూడు వారపు సెషన్ లను లక్ష్యం గా పెట్టుకొని వ్యాయామం చేయాలని వైద్యులు తెలిపారట. ప్రతి సెషన్ లో 3-5 సెట్ లలో 6-12 రిపిటేషన్ తో సమూహానికి 2-3 వ్యాయామాలు ఉండాలి. ఇది బలాన్ని పెంచుతుంది. ఎముక సాంద్రత, జీవక్రియను పెంచుతుందని ఫిట్నెస్ నిపుణులు తెలిపారు. మంచి ఆరోగ్య కరమైన వెజిటేరియన్ భోజనం, గోధుమ ఉత్పత్తులను తినాలని కూడా రమ్యకృష్ణ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: