దాంతో కుటుంబ భారం అంతా ఐశ్వర్య రాజేష్ పైన పడింది. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి నచ్చినప్పటికీ తన సొంత టాలెంట్ తోనే ఎదిగింది. నటిగా అవకాశాల కోసం ఎదురుచూసింది. ఎన్నో కష్టాలు పడి సినిమాలలో అవకాశాలను అందిపుచ్చుకుంది. ఐశ్వర్య రాజేష్ తన నటనతో తమిళనాట మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో కొన్ని సినిమాలలో నటించిన ఈ బ్యూటీ అనంతరం తెలుగులోను హీరోయిన్ గా నటించి కౌశల్య కృష్ణమూర్తి అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.
ఆ తర్వాత టక్ జగదీష్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాలలో అలరించింది. ఇప్పుడు ఈ బ్యూటీ సినీ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ భార్యగా నటించి మంచి గుర్తింపు అందుకుంది. అయితే ఆమె కెరీర్ ప్రారంభంలో తమిళ సినిమాలలో ఎక్కువగా నటించింది. అయితే తమిళంలో ఓ దర్శకుడు సినిమా అవకాశాలు ఎక్కువగా ఇస్తానని చెప్పారట. కానీ తాను చెప్పిన విధంగా చేయాలని బలవంత పెట్టాడట.
కమిట్మెంట్ కి ఒప్పుకోవాలని తను చెప్పిన విధంగా చేయాలని అన్నాడట. అలా చేస్తేనే సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానంటూ తమిళ దర్శకుడు టార్చర్ చేశాడట. అయినప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఐశ్వర్య రాజేష్ ఒప్పుకోకుండా తన సొంత టాలెంట్ తో సినిమాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.