- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

కన్నడ కస్తూరి సంజన మన తెలుగు వాళ్ళకు బాగా తెలిసిన అమ్మాయి సంజన చెల్లి నిక్కీ గల్రాని ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ ఈ హీరోయిన్ కి కాస్త కూస్తో ఇండ‌స్ట్రీ లో మంచి ఫేమ్ ఉంది. మన తెలుగువాడు ఆది పినిశెట్టిని ప్రేమించి పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. నిక్కి ఆమె అక్క సంజన ఇద్దరు కూడా అటు కన్న‌డం తో పాటు ఇటు తెలుగు లోనూ పలు సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. ఇదిలా ఉంటే గతంలో నిక్కీ గలరా ని ఓ హీరో వేధించాడని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. మరి ఇంతకీ ఆ హీరో ఎవరో ? చూద్దాం. నిక్కీగల్రాని తెలుగులో కమెడియన్ సునీల్ హీరోగా నటించిన కృష్ణాష్టమి సినిమాలో హీరోయిన్గా నటించింది. మరకతమణి వంటి సినిమాలలోనూ ఆమె నటించింది. తమిళ డబ్బింగ్ మూవీ మలుపులోను హీరోయిన్గా నటించింది.


నిక్కి కోలీవుడ్ నటుడు జీవా తో ఓ సినిమాలో నటించే సమయంలో ఆయన నన్ను టార్చర్ చేశాడు అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ పెట్టాక సినిమా ఇండస్ట్రీ నుంచి ఆమెపై తీవ్ర వ్యతిరేకత రావడంతో పోస్ట్ పెట్టిన కొద్ది గంటలకే ఆ పోస్ట్ డిలీట్ చేసి మళ్లీ ఆ పోస్ట్ నేను చేయలేదు .. నా సోషల్ మీడియా ఖాతాను ఎవరో హ్యాక్ చేసి దాన్ని పోస్ట్ చేశారు అని చెప్పింది. దీంతో ఇండస్ట్రీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో నిక్కి జీవా ఇంటికి వెళ్లి మరి ఆ పోస్ట్ నేను పెట్టలేదు అని బ్రతిమిలాడినట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే జీవా ఎలాంటి తప్పు చేయలేదు నిక్కి కావాలని అతనిపై తప్పుడు ఆరోపణలు చేసింది అని తన అభిమానులకు ... జనాలకు తెలియజేయడానికి మళ్లీ జీవా ఆమెతో కలిసి కి అనే సినిమాలో నటించారు. ఈ సినిమా అనుకున్నంత హిట్ కాలేదు. ఈ విషయం అప్పట్లో కోలీవుడ్ లో సెన్సేషన్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: