టాలీవుడ్ లో ఈసారి సంక్రాంతి కాస్త జోరుగానే జరిగింది..ముందుగా ఊహించిన సినిమాల కంటే ఊహించని సినిమాలు బరిలో నిలిచాయి..ఈ సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాలూ దేనికదే భిన్నమైన నేపథ్యాలతో తెరకెక్కాయి... కంటెంట్ పరంగా కానీ హీరోల ఇమేజ్ పరంగా చూసుకున్నా మూడూ సినిమాలు డిఫరెంట్ గానే ఉన్నాయి.ఈ సంక్రాంతి కానుకగా మొదటగా రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది..గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన ఈ సినిమాని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు.. రిలీజ్ అయిన మొదటి రోజే ఈ సినిమాకు నెగటివ్ టాక్ రావడం.అదే రోజు ఈ సినిమా HD ప్రింట్ ఆన్ లైన్ లో లీక్ కావడంతో గేమ్ ఛేంజర్ టీం కి పెద్ద షాక్ తగిలింది..దీనికి కారణమైన 45మందిని గుర్తించి మూవీ టీం కేస్ లు పెట్టింది.అయితే ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపిస్తుంది.

ఇక ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన రెండో సినిమా “డాకు మహారాజ్ “.. నందమూరి నటసింహం బాలయ్య హీరోగా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 12న గ్రాండ్ గా విడుదల అయింది.అయితే ఈమూవీపై ఉన్న భారీ అంచనాలను వందశాతం అందుకోలేదు అనే చెప్పాలి. కేవలం బాలయ్య ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకునే దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని రూపొందించాడు. రెగ్యులర్ యాక్షన్ డ్రామాకు చంబల్ లోయ నేపథ్యాన్ని ఆయన జోడించాడు. అయినా బాలయ్య తనదైన శైలిలో అదరగొట్టడంతో బాక్సాఫీస్ వద్ద డాకూ హిట్ టాక్ సొంతం చేసుకుంది...

 ఇక ఈ సారి అసలైన పండగ సినిమాతో బరిలోకి దిగాడు వెంకీ మామ..” సంక్రాంతికి వస్తున్నాం” అనే టైటిల్ తో ప్రేక్షకులలో సినిమాపై సూపర్ బజ్ తీసుకొచ్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి.. ఊహించని రేంజ్ లో ప్రమోషన్స్, సాంగ్స్ ఉండటంతో పండగ పూట ప్రేక్షకులంతా థియేటర్ కి క్యూ కట్టారు.. జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్ అనిపించుకుందీ. ఇద్దరు హీరోయిన్ల పెర్ఫార్మన్స్.. వెంకటేష్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి రైటింగ్, సెకండ్ హాఫ్ లో బుల్లిరాజు పాత్ర చేసిన హంగామాకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు... దీంతో వెంకటేష్ మూవీనే ప్రేక్షకులు అసలైన సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ చేస్తున్నారు..మూడు సినిమాలూ బాగానే వున్నా..సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి హ్యూజ్ టాక్ వినిపిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: