హీరోయిన్ నజ్రియా మలయాళంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నది  అయితే తెలుగులో కూడా అడపా దడపా సినిమాలలో నటించి బాగానే పేరు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ.. మలయాళం లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నజ్రీయా సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉంటూ తన కుటుంబానికి సంబంధించి పలు విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన భర్త ఫహద్ ఫాజిల్ గురించి కూడా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగు ప్రేక్షకులకు పుష్ప, పుష్ప -2 సినిమాలతోనే కాకుండా పలు చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ అందుకున్నారు.


తాజాగా తన భర్తకు ఒక అరుదైన వ్యాధి ఉందంటూ నజ్రీయా వెల్లడించింది.. దీంతో ఈ విషయం విన్న అభిమానులు కాస్త ఆశ్చర్యపోయారు.. ఫహాద్ గత కొద్ది నెలలుగా ADHD తో బాధపడుతున్నారని ఇది శ్రద్ధ లోపంతో ఉండే వ్యాధి అన్నట్లుగా వైద్యులు చెప్పారని తెలియజేసింది. అయితే ఈ వ్యాధి ఉన్నవారు ఎక్కువగా పరధ్యానం, చికాకుగా కలిగి ఉంటారని వెల్లడించింది.. ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వారిలో హైపర్ యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది నజ్రీయా.



అందుకే తన భర్త గురించి తనకి బాగా తెలుసు అని తాను కొంచెం ఓపికగా ఉండడానికి ప్రయత్నిస్తున్నానని కానీ అది తప్ప మా జీవితంలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది నజ్రియా. 2014లో రాజారాణి సినిమాతో మంచి పేరు అందుకున్న నజ్రీయా బెంగళూరు డేస్ నటించింది. ఆ సినిమాలోని ఫహద్ ఫాజిల్ భర్తగా నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి ఆ తర్వాత నిజజీవితంలో కూడా భార్య, భర్తలుగా కలిసిపోయారు. వివాహం అనంతరం ఈ జంట తమ సినిమాలలో బిజీగా ఉన్నారు. ఫహద్ ఫాజిల్ హీరోగా  కూడా పలు సినిమాలలో నటిస్తూ ఉండడమే కాకుండా చాలా సినిమాలలో విలన్ గా కూడా నటిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: