అయితే సంక్రాంతి కానుకగా నాగచైతన్య తన భార్యతో కలిసి దిగిన కొన్ని ఫొటోస్ షేర్ చేశారు . అదేవిధంగా శోభిత కూడా ఆ ఫొటోస్ షేర్ చేసింది. అయితే ఇదే మూమెంట్లో సోషల్ మీడియాలో శోభిత పై హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ జరిగేలా చేసింది . ఇప్పుడు ఎక్కడ చూసిన సరే శోభిత ధూళిపాళ్ల నే ఓ రేంజ్ లో ట్రోళ్ చేస్తున్నారు జనాలు. రెడ్ శారీలో అంతా చక్కగా కనిపించిన.. ఒక ఫోటోలో మాత్రం నాగచైతన్య అదే విధంగా శోభిత ధూళిపాళ్ల తమ కాళ్లని ఫోటో తీసి షేర్ చేశారు.
ఆ ఫోటోలో శోభిత ధూళిపాళ్ల కాళ్ళకి మెట్టలు లేవు . దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్లింగ్ స్టార్ట్ అయింది. కొంతమంది పద్ధతిగా పండగ పూటైనా మెట్టలు పెట్టుకోవచ్చుగా అంటుంటే మరి కొందరు మాత్రం దారుణాతి దారుణంగా సిగ్గు లేదా నీకు..? పెళ్లి అయిన ఆడదానివేగా..? సంప్రదాయాలు పాటించవా..? అంతకుముందు మెట్టెలు పెడుతున్నప్పుడు మాత్రం పెద్ద ఎమోషనల్ గా ఫీల్ అయిపోయావ్.. అంతా నాటకం ఇది.. అంటూ కావాలనే ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి శోభిత పడగ పూట సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కై పోయింది. దారుణాతి దారుణమైన ట్రోలింగ్ తన పేరు పై జరిగేలా చేసుకుంది..!