శ్రీలీల..ఈ పేరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది . దానికి కారణం ఆమె స్టార్ హీరోయిన్ అని .. ఒక యంగ్ హీరోయిన్ అని .. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చి తన కెరియర్ ప్లస్ గా మార్చుకున్నింది  అని ..చాలామంది చెప్పుకొస్తూ ఉంటారు . అయితే మరి కొందరు మాత్రం శ్రీలీల పుష్ప2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ఇండస్ట్రీకి వచ్చిన అది తక్కువ టైం లోనే తన పేరు మారుమ్రోగిపోయేలా చేసుకుంది అని మరి కొంతమంది అంటుంటారు .


రీజన్ ఏదైనా శ్రీలీల పేరు మాత్రం ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది . రీసెంట్ గానే పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి మెప్పించింది శ్రీ లీల . దెబ్బలు పడతాయి రాజా అంటూ ఇండస్ట్రీ మొత్తాని షేక్ చేస్తుంది. అయితే ఊ అంటావ పాట రేంజ్ లో ఆకట్టుకోలేకపోయినా..ఓ రేంజ్ లో మాత్రం ఆకట్టుకుంది. ఈ పాటపై ఎన్ని రీల్స్ వచ్చాయో అందరికీ తెలిసిందే. కాగా రీసెంట్ గా శ్రీలీల ప్రముఖ కమెడియన్ బ్రహ్మాజీ తో కలిసి ఈ పాట మీద రీల్ చేశారు .



శ్రీలీల "దెబ్బలు పడతాయి రాజా.. నీకుదెబ్బలు" పడతాయి అంటూ బ్రహ్మాజీతో డాన్స్ చేస్తూ పెట్టిన ఎక్స్ప్రెషన్స్ చాలా హైలైట్ గా మారాయి . ఈ రీల్ ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో బాగా వైరల్ గా మారింది.  అయితే ఈ రీల్ కింద కామెంట్స్ మాత్రం ఓ రేంజ్ లో అల్లాడించేస్తున్నాయి . కొందరు పాజిటివ్గా మరికొందరు నెగిటివ్గా చేస్తుంటే .. మరి కొందరు మాత్రం "బ్రహ్మాజీ గుర్తుపెట్టుకో ..ఈ రీల్  ను ఏదైనా మార్ఫ్ చేసావో.. నీకు దెబ్బలు పడతాయి.. అదేవిధంగా స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చింది నీకు ఈ శ్రీ లీలా " అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో శ్రీ లీల - బ్రహ్మాజీ రీల్ వీడియో వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: