చిరంజీవి అంటే ఇండస్ట్రీలో అందరికీ ఎంత మంచి రెస్పెక్ట్ ఉందో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దదిక్కుల భావిస్తూ ఉంటారు సినీ ఇండస్ట్రీ జనాలు . కాగా ఏ విషయానైనా చాలా చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే చిరంజీవి కొన్ని విషయాలలో మాత్రం రాంగ్ స్టెప్ తీసుకున్నాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . దానికి రీజన్ ఆయన కెరియర్ లో కొన్ని మంచి మంచి సినిమాలను మిస్ చేసుకోవడమే. దాదాపు 150 కి పైగా చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్లో వదులుకున్న సినిమాలు చాలా తక్కువ . కానీ వదులుకున్న సినిమాలన్నీ కూడా ఆల్ మోస్ట్ ఆల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కావడం గమనార్హం.కాగా చిరంజీవి ఇప్పటివరకు ఎనిమిది సినిమాలను వదులుకున్నారు . వాటిల్లో రెండు సినిమాలు అటు ఇటు టాక్ దక్కించుకోగా .. మిగతా 6 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్సే. చిరంజీవిబ్లాక్ బస్టర్ సినిమాలను ఎందుకు వదులుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం..!  


కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'మన్నెంలో మొనగాడు' సినిమాను మొదటగా హీరోగా చిరంజీవిని అనుకున్నారట . అయితే  అప్పటికే చిరంజీవికి మంచి ఇమేజ్ ఉండడంతో ఈ పాత్రకి ఆయన బాడీ సెట్ కాదు అంటూ రిజెక్ట్  చేశారట . ఆ తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ చేతికి ఈ మూవీ వెళ్ళింది. 'ఆఖరి పోరాటం' వైజయంతి మూవీస్ అధినేత అశ్వినిదత్.. హీరో చిరంజీవి హీరోయిన్ శ్రీదేవి కాంబినేషన్లో ఒక సినిమా అనుకున్నారట.  ఆ సమయంలో శ్రీదేవి ఫుల్ బిజీగా ఉండడం.. ఈ మూవీలో శ్రీదేవి పాత్రే  ఎక్కువగా ఉండడంతో ఈ సినిమాని చిరంజీవి వదులుకున్నారట .



అలా ఈ సినిమా నాగార్జున ఖాతాలో పడింది . ఈ చిత్రాలే కాదు సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'నెంబర్ వన్' ..అదేవిధంగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటించిన 'అసెంబ్లీ రౌడీ'.. వెంకటేష్ నటించిన 'సాహస వీరుడు సాగర కన్య'.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'ఆంధ్రావాలా'.. రజనీకాంత్ నటించిన 'చంద్రముఖి'.. రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రాలల్లో చిరంజీవినే  ముందుగా హీరోగా సెలెక్ట్ అయ్యారు . కానీ కొన్ని కారణాల చేత చిరంజీవి అన్ని సినిమాలను రిజెక్ట్ చేశారు. చిరంజీవి నటించిన 'విశ్వంభర' సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాలి ..కానీ కొన్ని కారణాల చేత సమ్మర్ కు వాయిదా వేశారు.  చిరంజీవి ఈ సినిమా తో మంచి హిట్ అందుకుంటాడు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: