అందుకే గేమ్ ఛేంజర్ చిత్రంపై సోషల్ మీడియాలో ఎక్కువగా నెగెటివిటీ ప్రచారం జరిగిందట. ఇక విడుదలైన రెండవ రోజు ఈ సినిమాకి సంబంధించి HD ప్రింట్ పైరసీగా మారింది. ఇలా ఎన్నో ఎఫెక్టులు పడినప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం ఒక మోస్తారు లోనే సంపాదించిందట.సుమారుగా ఈ సినిమాలోని పాటల కోసమే చిత్ర బృందం రూ .90 కోట్లతో పైగా ఖర్చు చేశారు. ఇదంతా కూడా వృధా అని అన్నట్టుగా చాలా మంది నెటిజన్స్ మాట్లాడుతున్నారు.
ఇటీవలే డైరెక్టర్ శంకర్ కూడా గేమ్ ఛేంజర్ సినిమా విషయంపై మాట్లాడుతూ సినిమా అవుట్ ఫుట్ విషయంలో తను చాలా సంతృప్తిగా చెందలేదని.. ఈ సినిమా కంటే బెటర్ గా చేయొచ్చు.. చాలామంది సీన్స్ నిడివి ఎక్కువగా ఉందని తొలగించామని ఈ సినిమా మొత్తం ఐదు గంటలకు పైగా ఉండదని తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమాని మొదట రెండు భాగాలుగా తీయాలనుకున్నారని కానీ కొన్ని కారణాల చేత ఈ సినిమాని ఒక్క భాగంగానే తీయాల్సి వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా చరణ్, కియారా మధ్య లవ్ సన్నివేశాలు, అలాగే రామ్ చరణ్ కు సంబంధించి చిన్నప్పటి సన్నివేశాలు, అప్పన్న, అంజలి పాత్రలో మరికొన్ని సన్నివేశాలు తొలగించామని అవుట్ పుట్ చూసిన తర్వాత రెండు భాగాలకు స్కోప్ లేకపోవడంతో చాలావరకు ఇందులోని సన్నివేశాలు కట్ చేశామని అందుకు ఒక పార్టీకే పరిమితం అయిందని తెలుస్తోంది. మొత్తానికి సంక్రాంతి దెబ్బకు గేమ్ ఛేంజర్ 2 ఆగిపోయినట్టుగా కనిపిస్తోంది.. ఒకవేళ మొదటి భాగం సక్సెస్ అయి ఉంటే రెండో భాగాన్ని కూడా తీసేవారేమో అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.