చాలామందికి 1990లో నటించిన హీరోయిన్లు ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేనట్టుగా ఉంటారు. పెళ్లి అవటం .. పిల్లలు పుట్టటం వల్ల బాగా లావెక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోతున్నారు. అలాంటివారి లో సంఘవి కూడా ఒకరు. ఒకప్పుడు తన చ‌బ్బి లుక్స్ .. తన కటౌట్ తో ఎంతోమంది కుర్రకారు హృదయాలను దోచుకున్న సంఘవి ప్రస్తుతం షేపౌట్ అయిపోయి సినిమాలుకు దూరంగా ఉంటుంది. బెంగళూరులో ఆమె తన ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. సినిమాలకు దూరమైన బుల్లితెర షోలకు జడ్జిగా చేస్తూ అప్పుడప్పుడు సినీ ప్రేమికులను సంఘవి పలకరిస్తూ ఉంటుంది. అలాంటి ముద్దుగుమ్మ ఒక హీరోతో తిరిగితే కెరీర్ నేశనం చేస్తానని ఒకరు వార్నింగ్ ఇచ్చారట.


ఇంతకీ ఆ హీరో ఎవరు ? ఆ వార్నింగ్ ఇచ్చింది ఎవరు ? అనేది చూద్దాం. తమిళ్ హీరో దళపతి విజయ్ - సంఘవి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అప్పట్లో వీరిద్దరి కెమిస్ట్రీ బాగుండడంతో విజయ్ తండ్రి చంద్రశేఖర్ వీరి కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు తీశారు. అలా విజయ్ - సంఘవి వరుస సినిమాల్లో చేసేసరికి ఇద్దరు మధ్య క్లోజనెస్ పెరిగి ప్రేమలో పడ్డారు అన్నట్టు అప్పట్లో టాక్‌ వినిపించింది. దీంతో ఈ విషయం ఎక్కువగా వైరల్ అయ్యేసరికి తనకి కొడుకు కెరీర్ పై ఎక్కడ మ‌ర‌క ప‌డుతుందో అని భావించిన విజయ్ తండ్రి డైరెక్టర్ చంద్రశేఖర్ సంఘవి ఇంటికి వెళ్లి మరి ఆమె తల్లికి సంఘవికి కలిపి వార్నింగ్ ఇచ్చారట.


నా కొడుకుతో ఇంకోసారి కలిసి తిరిగితే ఏమాత్రం బాగోదు అని చెప్పారట. వాడికి ఇప్పుడిప్పుడే హీరోగా రాణిస్తున్నాడు .. స్టార్ హీరో అవుతున్నాడు .. ఇలాంటి టైం లో ఈ రూమర్లు వస్తే అతడు ఫ్యూచర్ ఏం కావాలి .. ఇకనుంచి నా కొడుకుతో తిరిగితే అసలు సహించను .. నీకు సినిమాల్లో అవకాశాలు రాకుండా చేస్తా నీ కెరీర్ నాశనం చేస్తా అంటూ విజయ్ తండ్రి సంఘ‌వికి వార్నింగ్ ఇచ్చారట. అంతేకాదు అప్పటివరకు సంఘవి చేతిలో ఉన్న సినిమాలను కూడా వెన‌క్కు వెళ్లేలా చంద్రశేఖర్ కోలీవుడ్లో చక్రం తిప్పాడు అన్న పుకార్లు కూడా అప్పట్లో వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: