ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు సినిమా పరిశ్రమ నుండి మూడు భారీ సినిమాలు విడుదల అయ్యాయి. మొదటగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ సినిమా థియేటర్లలో జనవరి 10 వ తేదీన విడుదల కాగా , ఆ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజు సినిమా జనవరి 12 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఇక ఆఖరుగా విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది.

ఈ మూడు సినిమాలలో గేమ్ చెంజర్ మూవీ ని మినహాయిస్తే డాకు మహారాజ , సంక్రాంతికి వస్తున్నాం రెండు సినిమాలకు కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ప్రస్తుతం గేమ్ చెంజర్ మూవీ తో పోలిస్తే డాకు మహారాజ్ , సంక్రాంతికి వస్తున్నాం రెండు సినిమాలకు అద్భుతమైన కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో వస్తున్నాయి. ఇక ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి సంక్రాంతి విన్నర్ అని ఇప్పటికే జనాలకు క్లియర్ గా అర్థం అయింది. కానీ ఈ రెండు సినిమాల్లో ఏ మూవీ సంక్రాంతి విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే దానిపై కాస్త కన్ఫ్యూజన్ ప్రేక్షకుల్లో నెలకొంది. కానీ నిన్నటితో ఈ సంవత్సరం సంక్రాంతి విన్నర్ ఎవరు అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే దానిపై దాదాపు క్లారిటీ వచ్చింది అనే అభిప్రాయాలను కొంత మంది జనాలు వ్యక్తం చేస్తున్నారు.

డాకు మహారాజ్ , సంక్రాంతికి వస్తున్నాం రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చిన నిన్న మాత్రం ఎక్కువ శాతం కలెక్షన్లు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు , దానితో లాంగ్ రన్ లో డాకు మహారాజ్ కంటే కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎక్కువ కలక్షన్లను వసూలు చేసి ఈ సంవత్సరం సంక్రాంతి పండగ నిలిచే అవకాశాలు చాలా వరకు ఉన్నట్లు జనాలు అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా ఏ సినిమా నిలుస్తుంది అనేది క్లియర్ గా తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: