సంక్రాంతినాడు విడుదలైన ఈమూవీ అమెరికా నుండి అమలాపురం వరకు అన్నిచోట్లా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం సంచలానంగా మారింది. వాస్తవానికి ఈసినిమా హిట్ అవుతుందని దిల్ రాజ్ అనీల్ రావిపూడి అంచనాలు వేసినప్పటికీ ఈరేంజ్ లో బ్లాక్ బష్టర్ హిట్ కొడుతుందని ఇండస్ట్రీ ప్రముఖులు కూడ అంచనాలు వేయలేకపోయారు. ఈసినిమా దూకుడుని పరిశీలిస్తున్నవారు వెంకటేష్ కెరియర్ లో 100 కోట్ల సినిమాగా మారుతుందని ఒక ప్రాధమిక అంచనాకు వస్తున్నారు.
‘ఎఫ్ 2’ తరువాత దిల్ రాజ్ నిర్మాణంలో వచ్చిన అనేక సినిమాలు ఫెయిల్ అవ్వడంతో టెన్షన్ లో ఉన్న దిల్ రాజ్ కలక్షన్స్ కోరికను ఈమూవీ ఖచ్చితంగా తీరుస్తుందని అంచనాలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఈసినిమా ఓటీటీ రైట్స్ ఎవరికీ ఇవ్వకపోవడంతో ఈసినిమాకు వచ్చిన టోటల్ పాజిటివ్ టాక్ తో దిల్ రాజ్ కు కాసుల వర్షం ఖాయం అని అనున్నారు.
ఈసినిమాను చూసి వచ్చిన ప్రేక్షకుడు ఐశ్వర్య రాజేష్ నటనకు ఫిదా అవుతున్నారు. ఎటువంటి గ్లామర్ ఎక్స్ పోజింగ్ లేకుండా ఐశ్వర్య సహజ సిద్దంగా చేసిన నటనకు విమర్శకులతో పాటు సగటు ప్రేక్షకులు కూడ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈమూవీ ఇచ్చిన జోష్ తో వెంకటేష్ కు అదేవిధంగా ఐశ్వర్య రాజేష్ కు వరసపెట్టి అవకాశాలు క్యూ కట్టడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో ‘ఉప్పెన’ ఘనవిజయం తరువాత టాప్ రేంజ్ హీరోయిన్ గా మారిపోతుంది అనుకున్న కృతి శెట్టి తన సినిమాల ఎంపిక విషయంలో చేసిన పొరపాట్లు వల్ల ఆమ్ కెరియర్ బాగా నష్టపోయింది. అటువంటి పొరపాట్లు చేయకుండా ఐశ్వర్య ఎలాంటి అడుగులు పడతాయో చూడాలి..