తెలుగు సినీ ప్రేమికులకు దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన చాలా సంవత్సరాల క్రితమే డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను మొదలు పెట్టి ఆ తర్వాత నిర్మాతగా కెరియర్ ను ప్రారంభించాడు. నిర్మాతగా కెరియర్ను ప్రారంభించి అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయిన తర్వాత కూడా దిల్ రాజు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయడం వదిలి పెట్టలేదు. దానితో ఇప్పటికి కూడా ఈయన వరుస పెట్టి సినిమాలను నిర్మిస్తున్న అనేక సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా గేమ్ చేంజర్ , డాకు మహారాజ్ , సంక్రాంతికి వస్తున్నాం మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూడు సినిమాల్లో గేమ్ చేంజర్ , సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను దిల్ రాజు స్వయంగా నిర్మించాడు. డాకు మహారాజ్ సినిమాకు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ మూడు సినిమాలు ఇప్పటికే విడుదల అయ్యాయి. ఇందులో దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన గేమ్ చేంజర్ సినిమాకు విడుదల ఆయన మొదటి రోజే భారీ ఎత్తున నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేక పోతుంది. డాకు మహారాజ్ , సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది.

దానితో ఈ రెండు సినిమాలకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఇలా గేమ్ చేంజర్ మూవీ కి నెగటివ్ టాక్ వచ్చి కలెక్షన్లు రాకపోవడం , ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చి సూపర్ కలెక్షన్స్ రావడంతో చాలా మంది గేమ్ చేంజర్ సినిమా ద్వారా దిల్ రాజు కు దెబ్బ పడిన , మిగతా రెండు సినిమాల ద్వారా ఆయనకు లాభాలు వస్తాయి. వాటితో గేమ్ చేంజర్ నష్టాలు పోతాయి అనే అభిప్రాయాలను కొంత మంది జనాలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: